📄 ePaper
Saturday, February 21, 2026
📄 ePaper
HomeSports NewsCricketCricketer Shreyas Iyer : ఐసియులో శ్రేయ‌స్ అయ్య‌ర్‌.. ప‌క్క‌టెముక‌లకు గాయం

Cricketer Shreyas Iyer : ఐసియులో శ్రేయ‌స్ అయ్య‌ర్‌.. ప‌క్క‌టెముక‌లకు గాయం

వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్: ఆస్ట్రేలియాతో సిడ్నీలో జ‌రిగిన మ్యాచ్‌లో టీమ్ ఇండియా విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. కాగా ఆ మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తుండ‌గా టీమిండియా ఆట‌గాడు శ్రేయ‌స్ అయ్య‌ర్ (Cricketer Shreyas Iyer)గాయ‌ప‌డ్డాడు. బాల్ ను క్యాచ్ ప‌ట్టుకునేందుకు వెన‌క్కు పెరుగుపెడుతూ గ్రౌండ్ కు బ‌లంగా తాకాడు. ఈ ఘ‌ట‌న‌లో శ్రేయ‌స్ ప్లీహానికి తీవ్ర గాయ‌మైన‌ట్లు తెలుస్తోంది. దీంతో వెంట‌నే అత‌న్ని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. తాజాగా అత‌న్ని ఐసియులో చేర్చిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. శ్రేయ‌స్ అయ్య‌ర్ ప్లీహానికి గాయ‌మైంది. అత‌డి ప‌రిస్థితిపై వైద్య బృందం టెస్టులు చేయించింది. ఆ రిపోర్టుల్లో ర‌క్త‌స్త్రావం జ‌రిగిన‌ట్లు ప‌రీక్ష‌ల్లో తేలింది. దీంతో అత‌న్ని ఐసియులో చేర్చాం. ప్ర‌స్తుతం అత‌డి ప‌రిస్థితి నిల‌క‌డ‌గానే ఉంది. త‌ప్ప‌కుండా అత‌డు కోలుకోని తిరిగి వ‌స్తాడని క్రికెట్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

ఇది కూడా చదవండి :  Womens Cricket World Cup 2025 | లేడీస్ క్రికెట్ వరల్డ్ కప్ 2025: భారత్ మ్యాచ్ వర్షం ఆపేసింది – ఇంగ్లండ్ ఘన విజయం
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page