వాస్తవ నేస్తం,హైదరాబాద్ : సినిమా పరిశ్రమ కార్మిక కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తామని, సినిమా పరిశ్రమ కార్మికుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ టికెట్ రేట్ల పెంపు గురించి ఆలోచిస్తామని సీఎం రేవంత్ రెడ్డి (CM revanth Reddy) అన్నారు. ( Telugu cine industry ) తెలుగు సినిమా పరిశ్రమ ఉద్యోగుల ఫెడరేషన్, 24 ఇతర యూనియన్ ప్రతినిధులు మంగళవారం హైదరాబాదులో ఏర్పాటు చేసిన అభినందన సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సభలో సీఎం ప్రసంగించారు. టికెట్ రేట్లు పెంచాలంటే, పెరిగిన మొత్తంలో 20 శాతం సినీ కార్మికులకు ఇవ్వాలి. లేకపోతే ఇకపై జీవో ఇవ్వమని అని స్పష్టం చేశారు.
సినిమా టికెట్ రేట్లు పెరిగితే నిర్మాతలకు, ఎగ్జిబిటర్లకు మాత్రమే డబ్బులు వస్తాయి. కానీ, పరిశ్రమలో శ్రమిస్తున్న కార్మికులకు – లైట్ మెన్, కెమెరా టెక్నీషియన్లు, స్పాట్ బాయ్స్ వంటి సినీ పరిశ్రమ కార్మికులకు ఎలాంటి లాభం చేకూరాదు గాని ఎలాంటి లాభం చేకూరదు అని అందుకే, ఇకపై టికెట్ రేట్ల పెంపుకు అనుమతి (జీవో) ఇవ్వాలంటే, పెరిగిన రేట్‌లో 20 శాతం మొత్తం తప్పకుండా కార్మికుల సంక్షేమ నిధికి ఇవ్వాలి అన్నారు. హాలీవుడ్ ( Hollywood )ను ఇక్కడికి తీసుకువచ్చే బాధ్యత తనదేనన్నారు. చిన్న సినిమాలను తక్కువచేసి చూసే ప్రసక్తే లేదు. ప్రజాయుద్ధ నౌక గద్దర్ పేరుమీద గద్దర్ ఫిల్మ్ అవార్డ్ (Gaddar film awards)ప్రకటించి చిత్ర పరిశ్రమను ప్రోత్సహిస్తున్నామని అన్నారు.
ప్రభుత్వం తరపున రూ.10 కోట్లు సినీ కార్మికుల వెల్ఫేర్ ఫండ్‌లో డిపాజిట్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఇది మీ హక్కు. మీరు ఎప్పుడు అవసరమైనా ఈ డబ్బును ఉపయోగించుకోవచ్చునని ప్రకటించారు. కృష్ణనగర్ (Krishna Nagar)లో సినీ కార్మికుల పిల్లల కోసం ప్రత్యేక స్కూల్ నిర్మిస్తామన్నారు. సినీ పరిశ్రమ కార్మికుల పిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని తెలిపారు. హెల్త్ ఇన్షూరెన్స్, పెన్షన్, స్కిల్ డెవలప్‌మెంట్ ఈ సమస్యలన్నింటినీ కార్మికులు తన దృష్టికి తెచ్చారని ఆరోగ్య కార్డులు, స్కిల్ ట్రైనింగ్ సెంటర్లు, పెన్షన్ స్కీమ్ ఇవన్నీ మీకు అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. సినిమా పరిశ్రమలో ఎవరైనా వ్యక్తులు లేదా వ్యవస్థలు నియంత్రణ తీసుకోవాలనుకుంటే, ప్రభుత్వం ఊరుకోదని హెచ్చరించారు. హైదరాబాద్‌ను హాలీవుడ్ మార్చాలంటే, ముందు కార్మికుల సంక్షేమం బలోపేతం కావాలన్నారు. అందరూ కలిసికట్టుగా ముందుకు సాగినప్పుడే సినీ పరిశ్రమ కార్మికులు అభివృద్ధి చెందుతారు అన్నారు.
