e-paper
Thursday, January 8, 2026
HomeCricketWomen’s World Cup 2025 : జయహో ఇండియా.. ఫైనల్ కు చేరిన భారత్..!

Women’s World Cup 2025 : జయహో ఇండియా.. ఫైనల్ కు చేరిన భారత్..!

సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాపై భారత్‌ ఘన విజయం

నవంబర్‌ 2న సౌతాఫ్రికాతో ఫైనల్ పోరు

Women’s World Cup 2025 : మహిళల వరల్డ్ కప్ సెమీఫైనల్ లో భారత జాతీయ జెండా రెపరెపలాడింది.. మహిళల వరల్డ్ కప్ సెమీఫైనల్‌ లో ఆస్ట్రేలియాపై భారత 5 వికెట్ల తేడాతో గెలిచి, ఫైనల్‌ లోకి వెళ్ళింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 49.5 ఓవర్లలో 338 పరుగులకు ఆలౌట్‌ అయింది. అనంతరం 339 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్‌ 48.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించి, అద్భుత విజయాన్ని నమోదు చేసింది.

మహిళల వరల్డ్ కప్ (Women’s World Cup )సెమీఫైనల్ లో భారత్ విజయానికి జెమిమా రోడ్రిగ్స్‌ (127 నాటౌట్‌) సెంచరీతో కాంతినింపగా, కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (89) కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. ఈ జంట 180కి పైగా పరుగుల భాగస్వామ్యం కట్టి జట్టును విజయతీరాలకు చేర్చింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో లీచ్ ఫీల్డ్ (119; 93 బంతుల్లో 17 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీ బాదగా, ఎలీస్ పెర్రీ (77) అర్ధశతకంతో రాణించింది. చివర్లో ఆష్లీన్ గార్డ్‌నర్‌ (63) దూకుడుగా ఆడినా, భారత బౌలర్ల ఆఖరి దెబ్బలతో ఆసీస్‌ జట్టు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో శ్రీ చరణి, దీప్తి శర్మ చెరో రెండు వికెట్లు తీసి మెరుపులు మెరిపించగా, క్రాంతి గౌడ్‌, అమన్‌జ్యోత్ కౌర్‌, రాధా యాదవ్ చెరో వికెట్‌ సాధించారు. నవంబర్‌ 2న ఫైనల్‌లో భారత్‌ దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌పై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. మహిళల వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా (India Vs South Africa) తో ఈనెల నవంబర్ 2 న జరగనుంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page