📄 ePaper
Thursday, March 5, 2026
📄 ePaper
HomeTelanganaAdilabadగిరిజన సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడాలి : జిల్లా కలెక్టర్ రాజర్షి ష

గిరిజన సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడాలి : జిల్లా కలెక్టర్ రాజర్షి ష

వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: జిల్లాలోని సిరికొండ మండలం రాయగూడలో మంగళవారం రాత్రి రామ, సామ్రాట్ అశోక చారిటేబుల్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గుస్సాడి, దండారి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా , జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటిడిఏ పీఓ ఖుష్బూ గుప్తా, ఎస్సీ కమిషన్ సభ్యులు నీల బాయి పాల్గొని గిరిజన కళాకారులతో కలిసి నృత్య ప్రదర్శనలలో పాల్గొన్నారు. ఆశ్రమ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన ఈ ఉత్సవాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక గిరిజన కళాకారులు సాంప్రదాయ వేషధారణలో పాల్గొని తమ కళారూపాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గిరిజనుల సాంప్రదాయాలు, సంస్కృతి తెలంగాణకు ప్రత్యేక గౌరవం తెచ్చిపెడుతున్నాయని అన్నారు. ఇలాంటి ఉత్సవాలు కొత్త తరం యువతకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. గిరిజన కళల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. గిరిజనులు ప్రదర్శించే గుస్సాడి దండారి నృత్యాలు వారి ఆత్మీయత కు ప్రతీకలని అన్నారు. అనంతరం అధికారులను ట్రస్టు సభ్యులు, మహిళలు శాలువాలతో సన్మానించారు. అంతకుముందు గ్రామంలోని కొమురం భీం విగ్రహానికి కలెక్టర్, ఎస్పీ, పి ఓ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు అశోక్, గిరిజన నాయకులు, విద్యార్థులు, అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి :  Crime : కోరిక తీర్చాలని రౌడీ షీటర్‌ టార్చర్.. మాటు వేసి మరి
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page