📄 ePaper
Thursday, March 26, 2026
📄 ePaper
HomeHealth Newsకాపర్ బాటిల్‌లో నీళ్లు తాగితే చాలు.. ఎన్నో ప్రయోజనాలు

కాపర్ బాటిల్‌లో నీళ్లు తాగితే చాలు.. ఎన్నో ప్రయోజనాలు

కాపర్ బాటిల్ లో నీళ్లు తాగడం అలవాటు ఉందా. అయితే మీరు ఆరోగ్యాన్ని సొంతం చేసుకున్నట్టే లెక్క. రాగి బాటిల్స్ లో నీరు తీసుకోవడం వల్ల ఎన్నో విధాలుగా ప్రయోజనాలుంటాయి. జీర్ణ సమస్యలు తొలగిపోవడం నుంచి బరువు తగ్గడం వరకూ అన్ని విధాలుగా ఇది తోడ్పడుతుంది. అంతే కాదు. శరీరంలో పేరుకుపోయిన మలినాలను బయటకు పంపించడంలోనూ సహకరిస్తుంది. వీటితో పాటు మరి కొన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయి. అవేంటో వివరంగా తెలుసుకుందాం. బాడీ హైడ్రేట్ అవ్వడానికి కచ్చితంగా తగినంత నీరు తాగాల్సిందే. రోజుకు కనీసం మూడు లీటర్ల నీరు తాగకపోతే ఎన్నో సమస్యలు వస్తాయి. శరీరంలో పేరుకుపోతున్న మలినాలు బయటకు వెళ్లిపోవాలంటే సరైన విధంగా నీళ్లు తాగక తప్పదు. యూరిన్, చెమట ద్వారా ఈ టాక్సిన్స్ వెళ్లిపోతాయి. అయితే..నీళ్లు తాగకపోతే ఎలాంటి ఇబ్బందులు వస్తాయన్న విషయం చాలా మందికి అర్థమవుతోంది. అందుకే..ఇప్పుడు కచ్చితంగా లెక్క పెట్టుకుని మరీ నీళ్లు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో మరి కొన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. బాటిల్స్ లో నీళ్లు క్యారీ చేయడం మంచి అలవాటు. ఇప్పుడు ఈ బాటిల్స్ వాడకంలోనూ మార్పులు వచ్చాయి. చాలా మంది రాగి బాటిల్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. రాగి పాత్రలు, బాటిల్స్ లో నీళ్లు పోసుకుని తాగుతున్నారు. మరి ఈ కాపర్ బాటిల్స్ లో నీరు తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలుంటాయి.

ఇది కూడా చదవండి :  Ayushman Bharat | ఆయుష్మాన్ కార్డు: ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల చికిత్స సదుపాయం – ఎలా పొందాలి?
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page