📄 ePaper
Wednesday, February 4, 2026
📄 ePaper
HomeTelanganaHydrabadHyderabad youth courage : HYC సల్మాన్ నామినేషన్ తిరస్కరణ.. బీఆర్ఎస్‌లో చేరిన HYC సల్మాన్...

Hyderabad youth courage : HYC సల్మాన్ నామినేషన్ తిరస్కరణ.. బీఆర్ఎస్‌లో చేరిన HYC సల్మాన్ ఖాన్

వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్: హైదరాబాదులోని జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆసక్తి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. Hyderabad youth courage (HYC) సల్మాన్ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో పోటీ చేయడం కోసం ప్రచారం చేశారు. హెచ్వైసీ సల్మాన్ ప్రచారం అటు అధికార పార్టీకి మరియు ఇతర పార్టీ అభ్యర్థులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. జూబ్లీహిల్స్ బై పోల్స్ ఎలక్షన్లో పోటీ చేయడం కోసం HYC (Hyderabad youth courage)సల్మాన్ వేసిన నామినేషన్ రిజక్టు అయింది. దీనిపై HYC సాల్మాను స్పందిస్తూ కాంగ్రెస్ ఒత్తిడితోనే నామినేషన్ రిజెక్ట్ అయిందని సల్మాన్ ఆరోపించారు. తన నామినేషన్ తిరస్కరణకు గురైన మరుసటి రోజే హైదరాబాద్ యూత్ కరేజ్ (హెచ్‌వైసీ) వ్యవస్థాపకుడు సల్మాన్ ఖాన్ భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో చేరాలని నిర్ణయించుకున్నారు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గురువారం తెలంగాణ భవన్‌లో సల్మాన్ ఖాన్ అధికారికంగా పార్టీలో చేరారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఆయన వేసిన నామినేషన్లను ఎన్నికల సంఘం తిరస్కరించిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతకుముందు, అధికార కాంగ్రెస్ ప్రభుత్వ ఒత్తిడితోనే రిటర్నింగ్ అధికారి తన నామినేషన్లను అన్యాయంగా తిరస్కరించారని సల్మాన్ ఖాన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ వేదికగా ఆరోపించారు. ఎలాంటి సరైన కారణం లేకుండా తన నాలుగు నామినేషన్ పత్రాలను పక్కనపెట్టారని ఆయన పేర్కొన్నారు. సల్మాన్ ఖాన్ పలు వివాదాలతో వార్తల్లో నిలిచారు. క్రౌడ్ ఫండింగ్ ద్వారా సేకరించిన నిధులను దుర్వినియోగం చేశారని, ఆర్థిక మోసాలకు పాల్పడ్డారని ఆయనపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. అయితే, ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తుల విలువ కేవలం రూ. 5,18,101 మాత్రమేనని ప్రకటించడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. దీనికితోడు, సోషల్ మీడియాలో మతపరమైన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై బోరబండ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. నామినేషన్ తిరస్కరణకు గురైన వెంటనే బీఆర్ఎస్‌లో చేరుతుండటంతో, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఈ పరిణామం ఎలాంటి ప్రభావం చూపుతుందోనని రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా గమనిస్తున్నారు. అదేవిధంగా జూబ్లీహిల్స్ ఎన్నికలపై రాజకీయ విశ్లేషకులు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page