• సమస్యలు పరిష్కరించాలని వినతి..
• పలు అభివృద్ధి పనులకు జిల్లా కలెక్టర్ ఆమోదం
వాస్తవ నేస్తం,ఇచ్చోడ : మాదాపూర్ గ్రామ అభివృద్ధి, ప్రజల మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా గ్రామ సర్పంచ్ షేక్ ఇమ్రాన్ ముమ్మర యత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్‌కు శాలువా కప్పి, మొక్కను అందజేసి ఘనంగా సత్కరించారు. అనంతరం మాదాపూర్ గ్రామంలో నెలకొన్న పలు ప్రధాన సమస్యలు, అభివృద్ధి పనులపై ప్రత్యేకంగా చర్చించి వినతిపత్రం అందజేశారు. గ్రామంలో తీవ్రంగా ఉన్న మొబైల్ నెట్వర్క్ సిగ్నల్ సమస్యను పరిష్కరించేందుకు మొబైల్ టవర్ ఏర్పాటు చేయాలని, మురుగునీటి పారుదల కోసం సైడ్ డ్రైన్ల నిర్మాణం చేపట్టాలని సర్పంచ్ కోరారు. అలాగే మిషన్ భగీరథ ద్వారా గ్రామమంతటికీ పైప్‌లైన్ సౌకర్యం కల్పించాలని, అర్హులైన పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఇళ్లు మంజూరు చేయాలని కలెక్టర్‌ను విన్నవించారు.
సర్పంచ్ విన్నవించిన సమస్యలపై జిల్లా కలెక్టర్ రాజర్షి షా సానుకూలంగా స్పందించినట్లు సర్పంచ్ తెలిపారు . మాదాపూర్ గ్రామంలో ఈద్గా ఫ్లోరింగ్ పనులకు, కబ్రస్తాన్‌కు సీసీ రోడ్డు నిర్మాణానికి తక్షణ ఆమోదం తెలిపారు. వీటితో పాటు నూతనంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ కాలనీకి విద్యుత్ సౌకర్యం మరియు మిషన్ భగీరథ తాగునీటి కనెక్షన్లు త్వరితగతిన మంజూరు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
గ్రామ ప్రజల ఇబ్బందులను అర్థం చేసుకుని, మాదాపూర్ అభివృద్ధికి మరియు మౌలిక సదుపాయాల కల్పనకు తక్షణమే నిధులు, అనుమతులు మంజూరు చేసిన జిల్లా కలెక్టర్ గారికి షేక్ ఇమ్రాన్ , కాంగ్రెస్ సీనియర్ నాయకులు షాదుల్లా గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్లో వెంటనే చేరండి!
జాయిన్ వాస్తవ నేస్తం WhatsApp ఛానల్