📄 ePaper
Wednesday, February 4, 2026
📄 ePaper
HomeAstrologyఈ వారం రాశి ఫలాలు (18–24 జనవరి 2026): ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, ఆరోగ్యంలో మిశ్రమ...

ఈ వారం రాశి ఫలాలు (18–24 జనవరి 2026): ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, ఆరోగ్యంలో మిశ్రమ ప్రభావాలు

మధ్యస్థ వారపు ఫలాలు రాశుల వారీగా – వృత్తి, వ్యాపారం, ప్రేమ, కుటుంబం, ఆరోగ్య అంశాలలో వచ్చే అవకాశాలు, సవాళ్లు, సలహాలు.

మేష రాశి

మధ్యస్థ ఫలాలు కనిపిస్తున్నాయి. వృత్తి, వ్యాపార రంగంలో సానుకూల పరిణామాలు ఉంటాయి. చార్టెడ్ అకౌంటెంట్స్, ఫైనాన్స్, హోటల్ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది. కొత్త ప్రాజెక్ట్స్ ప్రారంభించే ముందు రెండుసార్లు ఆలోచించాలి. విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టాలి. వివాహ, పునర్వివాహ ప్రయత్నాలు మంచి ఫలితాలు ఇస్తాయి. భూ, రియల్ ఎస్టేట్, సాఫ్ట్వేర్ రంగాల్లో అవకాశాలు దక్కుతాయి.

వృషభ రాశి

వృత్తి, వ్యాపార రంగంలో అభివృద్ధి; రాజకీయ రంగంలో కొత్త అవకాశాలు. ఇంట్లో ఆదాయం పెరుగుతుంది, ఖర్చులపై జాగ్రత్త. విద్యార్థులు దక్షిణామూర్తి స్తోత్రం పఠన చేయాలి. విదేశీ వ్యవహారాలు సానుకూలం. కొత్త వాహనం కొనుగోలు, గృహ నిర్మాణం వేగవంతం.

  • లక్కీ సంఖ్య & కలర్: 2, గ్రే
  • బయటకు వెళ్ళాల్సిన రోజులు: గురువారం లేదా శుక్రవారం

మిధున రాశి

కుటుంబ, ఉద్యోగ రంగంలో కొన్ని చిన్న సమస్యలు; ఖర్చులు అదుపులో ఉంచాలి. నూతన వ్యాపారం జాతకం చూసి ప్రారంభించాలి. రాజకీయ రంగంలో అనుకూల సమయం. భూ వివాదాలు కొంత పరిష్కారం. ప్రతిరోజూ హనుమాన్ చాలీసా చదవడం వల్ల ఫలితాలు మెరుగ్గా ఉంటాయి.

  • లక్కీ సంఖ్య & కలర్: 4, గ్రీన్
  • బయటకు వెళ్ళాల్సిన రోజులు: బుధవారం లేదా శనివారం

కర్కాటక రాశి

మిశ్రమ ఫలాలు; బంధువులతో సఖ్యత, కానీ ఆర్థిక సమస్యలు. వ్యాపారంలో లాభ-నష్టం సమానంగా ఉంటుంది. స్వగృహ నిర్మాణ, విదేశాల్లో స్థిరపడే అవకాశాలు. కోపాన్ని అదుపులో ఉంచాలి. విద్యార్థులు హనుమాన్ చాలీసా పఠించాలి.

  • లక్కీ సంఖ్య & కలర్: 7, గ్రీన్
  • బయటకు వెళ్ళాల్సిన రోజులు: సోమవారం లేదా గురువారం

సింహ రాశి

చాలా అనుకూలం. ఉద్యోగం, వ్యాపారం, రాజకీయ రంగంలో పేరు, గుర్తింపు. చిన్న ఇబ్బందులు ఉండవచ్చు, కష్టపడితే ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం. విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టాలి. ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పఠించండి.

  • లక్కీ సంఖ్య & కలర్: 2, తెలుపు
  • బయటకు వెళ్ళాల్సిన రోజులు: ఆదివారం లేదా గురువారం

కన్యా రాశి

వృత్తి, వ్యాపార, రియల్ ఎస్టేట్, రాజకీయ రంగాల్లో మంచి అవకాశాలు. కొత్త వ్యాపార ఆలోచనలు, భూ వ్యవహారాలు సానుకూలం. ఆరోగ్యంపై శ్రద్ధ. విద్యార్థులు సరస్వతి హోమం, విద్యా గణపతి హోమం చేయించుకోవాలి.

  • లక్కీ సంఖ్య & కలర్: 2, స్కై బ్లూ
  • బయటకు వెళ్ళాల్సిన రోజులు: సోమవారం లేదా గురువారం

తులా రాశి

చాలా అనుకూలం. కుటుంబ బాధ్యతలు, వ్యాపారం, ఉద్యోగం సక్రమంగా సాగుతుంది. ఖర్చులు అధికం; శుభకార్యాలకు మాత్రమే ఖర్చు. భూ వ్యవహారాలు సానుకూలం. విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టాలి.

  • లక్కీ సంఖ్య & కలర్: 1, డార్క్ మెరూన్
  • బయటకు వెళ్ళాల్సిన రోజులు: సోమవారం లేదా శుక్రవారం

వృశ్చిక రాశి

చాలా అనుకూలం. ఉద్యోగ, వ్యాపార లాభాలు, పదోన్నతి. ఖర్చులు అధికం, మానసిక ఒత్తిడి. వివాహ, సంతానం, విద్యార్థి విషయాలు సానుకూలం. ప్రతిరోజూ ఓం నమశ్శివాయ పఠన, సుబ్రహ్మణ్య స్వామి పూజ.

  • లక్కీ సంఖ్య & కలర్: 7, మెరూన్
  • బయటకు వెళ్ళాల్సిన రోజులు: మంగళవారం లేదా శనివారం

ధనుస్సు రాశి

చాలా అనుకూలం. వృత్తి, వ్యాపారం, పేరుగొట్టడం సులభం. ఖర్చులు అదుపులో, ఆరోగ్యం బాగుంది. విదేశీ సంబంధిత పనులు సానుకూలం. విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టాలి. ప్రతిరోజూ దక్షిణామూర్తి, శని స్తోత్రం పఠించండి.

Zodiac Signs Weekly Horoscope 18-24 January 2026 with Career, Love, Health Predictions
Weekly Horoscope 18-24 January 2026: Predictions for Career, Love, Finance, and Health
  • లక్కీ సంఖ్య & కలర్: 6, తెలుపు
  • బయటకు వెళ్ళాల్సిన రోజులు: గురువారం లేదా శనివారం

మకర రాశి

మధ్యస్థ ఫలాలు. వృత్తి ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు. నూతన వ్యాపార ప్రారంభానికి కాలం అనుకూలం కాదు. ఉద్యోగ ప్రయత్నంలో ఆటంకాలు. ప్రతిరోజూ సుబ్రహ్మణ్యస్వామి పూజ, హోమాలు చేయించాలి.

  • లక్కీ సంఖ్య & కలర్: 9, గ్రే
  • బయటకు వెళ్ళాల్సిన రోజులు: సోమవారం లేదా బుధవారం

కుంభ రాశి

మిశ్రమ ఫలాలు. ఆరోగ్యం, ఉద్యోగం, వ్యాపారం పరంగా జాగ్రత్త అవసరం. ఖర్చులు అదుపులో ఉంచాలి. భూ, కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్త. విద్యార్థులు కాలం అంతా అనుకూలంగా లేరు. ప్రతిరోజూ శని స్తోత్రం, కాలభైరవాష్టకం పఠించాలి.

  • లక్కీ సంఖ్య & కలర్: 4, నేవీ బ్లూ
  • బయటకు వెళ్ళాల్సిన రోజులు: శుక్రవారం లేదా బుధవారం

మీన్ రాశి

చాలా అనుకూలం. దూరప్రాంత ప్రయాణాలు, ఉద్యోగ, వ్యాపారం, చదువు సానుకూలం. ప్రతిరోజూ విద్యా గణపతి, సరస్వతి హోమం చేయించండి. ఆరోగ్య సమస్యలు కొంత జాగ్రత్త అవసరం. భాగస్వామి, స్నేహితులతో వ్యవహారం ఆచితూచి చేయాలి.

  • లక్కీ సంఖ్య & కలర్: 6, తెలుపు
  • బయటకు వెళ్ళాల్సిన రోజులు: సోమవారం లేదా గురువారం

ఈ వారం ఎక్కువగా వృత్తి, వ్యాపారం మరియు భూ సంబంధిత అంశాల్లో అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలి. ఆరోగ్యంపై జాగ్రత్తలు, ఖర్చులపై క్రమశీలత ముఖ్యంగా ఉండాలి.

Written by: Qamar SD
Vaasthava Nestham Editorial Team
Published: January 19, 2026 | 2:58 AM

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page