📄 ePaper
Monday, May 18, 2026
📄 ePaper
HomeBusinessGold Rates: భగ్గుమంటున్న బంగారం.. పెళ్లిళ్లంట పాత నగల వైపే జనం చూపు!

Gold Rates: భగ్గుమంటున్న బంగారం.. పెళ్లిళ్లంట పాత నగల వైపే జనం చూపు!

రోజు రోజుకు పెరుగుతున్న బంగారం ధరలు మధ్యతరగతి కుటుంబాలకు మరింత ఆర్థిక భారాన్ని మోపుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ సందడి మొదలైనా, బంగారం దుకాణాల్లో మాత్రం సామాన్యుల ముఖాల్లో ఆనందం కనిపించడం లేదు. ఒకవైపు ముహూర్తాలు దగ్గరపడుతుంటే.. మరోవైపు బంగారం ధరలు (Gold Prices) ఆకాశాన్ని తాకుతుండటంతో మధ్యతరగతి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. “కొనలేం.. తినలేం” అన్న చందంగా తయారైంది సామాన్యుడి పరిస్థితి. బంగారం ధరలతో పాటు నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్న క్రమంలో పెళ్లి చేయడమే గగనమైన ఈ రోజుల్లో మధ్యతరగతి కుటుంబాలకు బంగారు కొనుగోలు అనేది కలగానే మిగులుతుందా.? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

Hyderabad Gold Rate Today
Check the latest 22K & 24K live gold prices updated daily.


👉 Click here to see today’s live rates

మధ్యతరగతి ప్రజల పెళ్లిళ్లంట వధువుకు బంగారం కొనుగోలు చేయడం ఒక పెద్ద సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో మధ్యతరగతి ప్రజలు పాత అభరణాల వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

కొత్తవి కొనలేక.. పాతవి మార్చుకుంటూ..

ప్రస్తుతం మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రికార్డు స్థాయిలోనే కొనసాగుతోంది. దీనికి తోడు తరుగు (Wastage), మజూరీ (Making Charges), మరియు జీఎస్టీ (GST) అన్నీ కలిపితే తులం బంగారం ధర సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుకుంది. దీంతో మెజారిటీ జనం కొత్త బంగారం కొనుగోలును వాయిదా వేసుకుంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లిళ్ల కోసం కొనాల్సి వస్తే.. ఇంట్లో ఉన్న పాత బంగారాన్ని ఇచ్చి, కొత్త డిజైన్లను మార్చుకోవడం (Exchange Offers) వైపు మొగ్గు చూపుతున్నారు. కేవలం తయారీ ఖర్చులు మాత్రమే భరించి, పాత బంగారం స్థానంలో కొత్త నగలు పొందేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గతంతో పోలిస్తే కొత్త కొనుగోళ్లు తగ్గాయని, ఎక్స్చేంజ్ ఆఫర్లే ఎక్కువగా నడుస్తున్నాయని జ్యువెలరీ వ్యాపారులు చెబుతున్నారు.

లైట్ వెయిట్ నగలకే (Light Weight Jewelry) డిమాండ్

పెరిగినంబంగా పెరిగిన బంగారు ధరలతో కొత్త అభరణాలు కొనలేక తక్కువ బరువు ఉండే 18 క్యారెట్ల లేదా 22 క్యారెట్ల ఫ్యాన్సీ ఆభరణాల వైపు ఆసక్తి చూపుతున్నారు. బడ్జెట్ కుదిరిరాకపోవడంతో చాలామంది 1 గ్రాము బంగారం (Gold Coated) ఆభరణాల వైపు కూడా చూస్తుండటం గమనార్హం. దాదాపు రెండు లక్షలకు చేరువలో ఉన్న తులం బంగారం ధర పేద ప్రజలు, మధ్యతరగతి కుటుంబ ప్రజలకు ‘బంగారం’ రాత్రి ఆకాశంలోని చందమామల కనిపిస్తోంది. అంటే అందాన్ని చూసి నేర్చుకోవడం తప్ప కొనలేని పరిస్థితి ఏర్పడింది అని చెప్పుకోవచ్చు.

ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?

అంతర్జాతీయ కారణాలే ప్రస్తుత ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి అని ఒక నజర్ వేస్తే.. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల నిర్ణయాలు, అంతర్జాతీయంగా డాలర్ విలువలో మార్పులు, వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని నిల్వ చేసుకోవడం వంటి అంశాలను నిపుణులు చర్చిస్తున్నారు. రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని, ఇప్పట్లో తగ్గే సూచనలు తక్కువగా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Note: Images used in this article are generated by AI for representation purposes.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular