📄 ePaper
Friday, April 24, 2026
📄 ePaper
HomeCrime Newsవడ్డీ వ్యాపారుల గుండెల్లో ‘పోలీస్’ వణుకు.!

వడ్డీ వ్యాపారుల గుండెల్లో ‘పోలీస్’ వణుకు.!

• జిల్లావ్యాప్తంగా ఏకకాలంలో 45 బృందాలతో మెరుపు దాడులు

• 15 పోలీస్ స్టేషన్ల పరిధిలో 16 కేసులు నమోదు

 • భారీగా ప్రామిసరీ నోట్లు, చెక్కులు, పట్టాదార్ పాస్ పుస్తకాలు స్వాధీనం

 • అక్రమ వ్యాపారులపై జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ హెచ్చరిక

వాస్తవ నేస్తం,అదిలాబాద్ : అమాయక ప్రజలు, రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని అధిక వడ్డీలతో రక్తాన్ని పిండుతున్న అక్రమ వడ్డీ వ్యాపారులపై అదిలాబాద్ జిల్లా పోలీస్ యంత్రాంగం ఉక్కుపాదం మోపింది. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు గురువారం జిల్లావ్యాప్తంగా వడ్డీ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాలపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులు జిల్లాలో ఒక్కసారిగా కలకలం రేపాయి.

45 బృందాలు.. వంద మందిపై నిఘా..

జిల్లావ్యాప్తంగా 16 మండలాల్లోని 15 పోలీస్ స్టేషన్ల పరిధిలో సుమారు వంద మంది వడ్డీ వ్యాపారులే లక్ష్యంగా ఈ తనిఖీలు సాగాయి. మొత్తం 45 ప్రత్యేక బృందాలు ఏకకాలంలో దాడుల్లో పాల్గొన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవసాయ భూములను తాకట్టు పెట్టుకోవడం, అమాయకుల పేరిట ఉన్న భూములను తమ పేర్లపై రాయించుకుని అధిక వడ్డీలకు అప్పులిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ ఆకస్మిక తనిఖీల్లో వ్యాపారుల వద్ద అక్రమంగా ఉన్న అనేక పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిల ప్రామిసరీ నోట్లు, ఖాళీ చెక్కులు, పట్టాదార్ పాస్ పుస్తకాలు , బాండ్ పేపర్లు, సేల్ డీడ్లు ,ముందస్తుగా సంతకాలు తీసుకున్న ఖాళీ స్టాంప్ పేపర్లు స్వాధీనం పోలీసులు చేసుకున్నారు.

ఇది కూడా చదవండి :  Naa Anveshana | ఒక్క వీడియోతో అన్వేష్ కెరీర్‌కు భారీ దెబ్బ.. 24 గంటల్లో ఎంతమంది అన్‌సబ్‌స్క్రైబ్ చేశారంటే..!

15 కేసులు.. 15 మంది నిందితుల అరెస్ట్.. 

ఈ దాడుల అనంతరం నిబంధనలు ఉల్లంఘించిన 15 మందిపై 7 పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆదిలాబాద్ టూ టౌన్ : నాయిని సుదర్శన్ (ఖుర్షీద్ నగర్)

తలమడుగు: కటకం రాజు, శ్రీనివాస్ (దేవాపూర్) , మావల: కుంటి లింగన్న, దుర్గారెడ్డి , నేరడిగొండ: గంగారెడ్డి, శ్రీనివాస్, జుంబేరాత్ రాహుల్ , తాంసి: ఉప్లంచి నగేష్, ఉప్లంచి గంభీర్ ,  ఇచ్చోడ: గొతి సుందర్ సింగ్, గిట్టే మారుతి, కదం సుదర్శన్, కదం సాయి కృష్ణ సిద్ధాంత్, గుడిహత్నూర్: దహాలే పవన్

బాధితులు భయపడొద్దు: ఎస్పీ అఖిల్ మహాజన్

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. అధిక వడ్డీలతో సామాన్యుల నడ్డి విరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. లైసెన్స్ లేకుండా వడ్డీ వ్యాపారం చేయడం, బలవంతపు వసూళ్లకు పాల్పడటం నేరమని పేర్కొన్నారు. అసాంఘిక కార్యకలాపాలను రూపుమాపే వరకు ఈ తనిఖీలు కొనసాగుతాయని, బాధితులు ధైర్యంగా పోలీసులను ఆశ్రయించాలని ఆయన కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page

https://man2bantul.id/https://portal.man2bantul.id/https://sirekap.man2bantul.id/https://eptsp.man2bantul.id/https://smkn5balam.com/https://tuluskartika.or.id/https://smptk.tuluskartika.or.id/https://www.stai-nurulhidayah.ac.id/https://journal.stai-nurulhidayah.ac.id/https://ejurnal.stai-nurulhidayah.ac.id/https://tical2025.redclara.net/https://uptdselatan.com/masterpoker99masterpoker99masterpoker99poker757poker757
masterpoker99masterpoker99masterpoker99masterpoker99inifun88inifun88inifun88https://jrdindustry.com/inifun88inifun88inifun88inifun88inifun88vovo88vovo88vovo88vovo88vovo88
inifun88inifun 88inifun88 logininipokerini pokerinipoker loginvovo88vovo88vovo88vovo88inifun88inifun88inifun88vovo88