📄 ePaper
Wednesday, March 25, 2026
📄 ePaper
HomeCrime NewsAedegonv | క్షణికావేశం... యువకుడు ఆత్మహత్య

Aedegonv | క్షణికావేశం… యువకుడు ఆత్మహత్య

వాస్తవ నేస్తం,ఇచ్చోడ: క్షణికావేశం తో ఆ యువకుడు తీసుకున్న నిర్ణయంతో ఓ కుటుంబం పెద్దదిక్కునే కోల్పోయింది. ఇటీవ తన తండ్రి అనారోగ్యంతో మృతి చెందగా ఆ కుటుంబానికి తన కుమారుడే పెద్దదిక్కు అని తన తల్లి అనుకునే తరుణంలోనే ఆ యువకుడు మృతి చెందడంతో ఆ తల్లి రోదన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. వివరాల్లోకి వెళితే ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం అడేగామ(కే) గ్రామానికి చెందిన శేఖర్ అనే యువకుడు గత రెండు రోజుల క్రితం పురుగుల మందును తాగగా కుటుంబ సభ్యులు హుటాహుటిగా చికిత్స కోసం జిల్లా కేంద్రంలోనికి రిమ్స్ కు తరలించారు. చికిత్స పొందుతూ యువకుడు మంగళవారం రాత్రి మృతి చెందాడు. గత రెండు నెలల క్రితం తన తండ్రి అయిన నర్సయ్య (డోలన్న) మృతి చెందాడు. తండ్రి మృతి చెందడంతో ఆ యువకుడు కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటాడని అనుకొనే క్రమంలోని ఆ యువకుడు మృతి చెందడంతో ఆ కుటుంబం పెద్దదిక్కునే కోల్పోయింది. శేఖర్ అందరితో కలిసి మెలిసి ఉండడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇది కూడా చదవండి :  Cyclone Montha effect | మొంథా ఎఫెక్ట్.. తెలంగాణలో భారీ వర్షాలు
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page