- మహారాష్ట్రకు చెందిన ఇమ్రాన్ బాబు షేక్
- ఇచ్చోడకు చెందిన మొహమ్మద్ జాకిర్
- పశువులకు అధిక డిమాండ్ ఉండడంతో అక్రమంగా కొచ్చిన్ తరలింపు
- పశువుల అక్రమ రవాణా ముఠా ను పట్టుకున్న పోలీసులు
- 8 మంది రిమాండ్ కు తరలింపు
- ఇద్దరు పరార్..
వాస్తవ నేస్తం, ఆదిలాబాద్:
అంతర్ రాష్ట్ర పశువుల అక్రమ రవాణా రాకెట్ ను పోలీసులు భగ్నం చేశారు. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ ఎస్సై ఇమ్రాన్ పత్రిక ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్ర గాడ్చందూర్ (Maharashtra Gadh chandur) కు చెందిన ఇమ్రాన్ బాబు షేక్ , ఇచ్చోడకు చెందిన మొహమ్మద్ జాకిర్ లు జిల్లాలోని పలు గ్రామాలలో పశువులను సేకరించేవారు.
వీరికి సఫాన్ హనీఫ్ సేథ్, అస్లాం, మెహబూబ్ అలీ ఖురేషి లు సహాయం చేసేవారు. పశువులకు కొచ్చిన్ లో అధిక డిమాండ్ ఉండడంతో వారు సేకరించిన పశువులను కొచ్చిన్ తరలిస్తున్న క్రమంలో ఈనెల మూడవ తేదీన ఇచ్చోడ పశువుల సంత నుండి 16 ఎద్దులను కొనుగోలు చేసి, మూడు ఎద్దులను దొంగలించి వాహనాల్లో కొచ్చిన్ తరలిస్తున్న క్రమంలో ముందస్తు సమాచారం మేరకు ఆదిలాబాద్ జిల్లాలోని నేరడిగొండ మండలం రోల్ మామడ (toll plaza) వద్ద పోలీసులు పట్టుకున్నారు.
ఈ నేరంలో పాలుపంచుకున్న ఎనిమిది మందిని రిమాండ్కు తరలించగా ఇద్దరు పరారులో ఉన్నట్లు ఎస్సై తెలిపారు.

