వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్ : నైరుతి-ఆగ్నేయ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం బలపడి తుఫాన్ గా మారినట్లు వాతారణ శాఖ తెలిపింది. ఇది రేపు (మంగళవారం) ఉదయం నాటికి తీవ్ర తుఫాన్ గా మారే అవకాశం ఉంది. ఈ మొంథా తుఫాన్ (Cyclone Montha)ప్రభావంతో తీరం వెంట 50-70 కి. మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. మొంథా మచిలీపట్నం-కళింగపట్నం మధ్యగా కాకినాడ సమీపంలో మంగళవారం తీరం దాటే అవకాశం ఉంది. మొంథా ముప్పు పొంచి ఉండటంతో ఆంధ్రప్రదేశ్ సర్కార్ అప్రమత్తమైంది. సర్కార్ ముందస్తు చర్యలు చేపట్టింది. మొంథా ఎఫెక్ట్‌తో అధికారులకు సెలవు రద్దు చేసింది. తక్షణ సహాయ చర్యల కోసం ప్రభుత్వం రూ. 19 కోట్లు విడుదల చేసింది. అలాగే ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఎన్ డిఆర్ ఎఫ్, ఎపి ఎస్ డీ ఎం ఎ దళాలు అప్రమత్తమయ్యాయి. 16 శాటిలైట్ ఫోన్లు ఏర్పాటు చేశారు. తీర ప్రాంతాలలోని 57 మండలాల పరిధిలో 219 తుఫాన్ షెల్టర్లు ఏర్పాటు చేశారు. సముద్ర తీరాల్లో పర్యాటకుల రాకపోకలపై నిషేధం విధించారు.
Visakhapatnam | విద్యా సంస్థలకు సెలవులు :
అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో విద్యాస్థంస్థలకు ఎల్లుండి వరకు సెలవులు ప్రకటించారు. పశ్చిమగోదావరి, ఏలూరు, కడప, బాపట్లలో విదాసంస్థలకు రూపటి వరకు సెలవులు ప్రకటించారు. అలాటే నెల్లూరు జిల్లాలోని విద్యాసంస్థలకు ఇవాళ సెలవు ప్రకటించారు.

