e-paper
Thursday, January 8, 2026
HomeTelanganaAdilabadfolic acid | ఐరన్ మాత్రలు వికటించి విద్యార్థుల అవస్థత 

folic acid | ఐరన్ మాత్రలు వికటించి విద్యార్థుల అవస్థత 

విద్యార్థులను ఆసుపత్రికి తరలించిన ఉపాధ్యాయులు 

ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలో ఘటన

వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: ఐరన్ మాత్రలు (ఫోలిక్ యాసిడ్) మింగి విద్యార్థులు అవస్థతకు గురై ఆస్పత్రి పాలైన ఘటన ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలో జరిగింది. వివరాల్లోకి వెళితే బజార్ హత్నూర్ మండలంలోని కొలారి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు భోజన అనంతరం ఆశా కార్యకర్త ఇచ్చిన ఐరన్ మాత్రలు (folic acid) వేసుకున్నారు. ఐరన్ మాత్రలు వేసుకున్న విద్యార్థులు వాంతులు చేసుకోవడం గమనించిన ఉపాధ్యాయులు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అవస్థలకు గురైన విద్యార్థులకు చికిత్స అందిస్తున్నట్లు విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని ఏంఈఓ రామకృష్ణ తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page