📄 ePaper
Thursday, March 26, 2026
📄 ePaper
HomeCrime NewsHyderabad Bangalore Bus Accident : కర్నూల్ లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం..

Hyderabad Bangalore Bus Accident : కర్నూల్ లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం..

• 11 మంది మృతి సజీవ దహనం

• హైదరాబాద్ నుండి బెంగళూరుకు ( Kaveri Travels ) కావేరీ ట్రావెల్ బస్సు

Hyderabad Bangalore Bus Accident : వారందరూ నిద్ర మత్తులో ఉన్నారు.. కొంత దూరం ప్రయాణిస్తే తమ గమ్యస్థానానికి చేరుకుంటారు.. కానీ వారిని మృత్యు బస్సు ప్రమాద రూపంలో కబలించింది. కర్నూల్ లో ఈరోజు (శుక్రవారం) తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. బస్సులో మంటలు చెలరేగడంతో నిద్రలోనే చాలామంది సజీవదహనం అయ్యారు. రాత్రి హైదరాబాద్ నుండి బెంగళూరు బయలుదేరిన ప్రయాణికులు తెల్లవారేసరికి ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ నుండి బెంగళూరు వెళుతున్న ఓ ( Kaveri Travels ) ట్రావెల్ బస్సు మంటల్లో చిక్కుకోవడంతో చాలామంది సజీవదహనం అయ్యారు. మరికొందరు తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఈ దుర్ఘటన కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. అయితే ఈ బస్సులో మంటలు ఎలా చెలరేగాయి? ఎలా వ్యాపించాయి.? అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Kurnool Bus Accident : కర్నూల్ బస్ యాక్సిడెంట్ కి కారణమిదే?

హైదరాబాద్ కూకట్ పల్లి నుండి బెంగళూరుకు కావేరీ ట్రావెల్ బస్సు గురువారం రాత్రి బయలుదేరింది. బస్సు సిబ్బందితో పాటు మొత్తం 43 మంది ప్రయాణికులు అందులో ఉన్నారు. హైదరాబాద్ దాటగానే చాలామంది ప్రయాణికులు నిద్రలోకి జారుకున్నారు. డ్రైవర్ ఒక్కరు తప్ప అందరూ గాఢనిద్రలో ఉన్నారు. ఈ సమయంలో జరిగిన చిన్న ప్రమాదం ఈ స్థాయిలో ప్రాణనష్టం సృష్టించిందని డిఐజి ప్రవీణ్ కుమార్ తెలిపారు.

ఇది కూడా చదవండి :  అమెరికా–వెనెజువెలా ఉద్రిక్తతలు: బంగారం, వెండి ధరలకు రెక్కలు, ముడి చమురు మార్కెట్‌లో కలకలం

Kurnool Bus Accident : బస్సు ప్రమాదానికి ఆ పైకే కారణమా..?

బస్సు కర్నూల్ జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు దగ్గర హైదరాబాద్-బెంగళూరు హైవేపై వేగంగా వెళుతుండగా ఓ బైక్ అడ్డువచ్చింది. దీంతో దాన్ని ఢీకొట్టినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే బైక్ ఉన్నవ్యక్తి రోడ్డుపక్కన పడిపోగా బైక్ మాత్రం బస్సు కింద పడింది. దీంతో తీవ్ర రాపిడి జరిగి నిప్పురవ్వలు పుట్టి పెట్రొల్ ట్యాంక్ పీలడంతో బస్సు మొత్తం మంటలు వ్యాపించాయి. ఇలా యాక్సిడెంట్, ఆ వెంటనే మంటలు చెలరేగడంతో బస్సు డ్రైవర్, ఇతర సిబ్బంది భయంతో కిందకు దిగిపోయారు. సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా గాలి ఎక్కువగా ఉండటంతో క్షణాల్లో బస్సు మొత్తాన్ని వ్యాపించాయి. బస్సులో ( Kaveri Travels ) ప్రయాణికులంతా గాఢనిద్రలో ఉండగా ప్రమాదం జరగడంతో ప్రాణనష్టం ఎక్కువగా ఉందని పోలీసులు చెబుతున్నారు. మంటలు చుట్టుముట్టడంతో నిద్రలేచి తప్పించుకునే ప్రయత్నం చేసేలోపే చాలామంది సజీవదహనం అయ్యారు. కొందరు ప్రయాణికులు మాత్రం ఎమర్జెన్సీ డోర్, విండోస్ బ్రేక్ చేసి తప్పించుకున్నారు. మరికొందరు తీవ్ర గాయాలతో బైటపడ్డారు. బస్సు ఢీకొట్టడంతో బైక్ పై వెళుతున్న వ్యక్తి కూడా మరణించాడని.. అతడి మృతదేహం బస్సుప్రమాద ప్రాంతంలోనే రోడ్డుపక్కన పడివుందని డిఐజి ప్రవీణ్ కుమార్ తెలిపారు.

Kurnool Bus Accident : ఇద్దరు చిన్నారులు..

ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 43 మంది ఉన్నారు. వీరిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటివరకు 11 మంది మరణించినట్లు పోలీసులు నిర్దారించారు. మరికొందరి ఆఛూకీ లేదు కాబట్టి వారుకూడా మరణించి వుంటారని భావిస్తున్నారు. కాబట్టి మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. 23 మంది ప్రయాణికులు సురక్షితంగా ప్రాణాలతో బైటపడ్డట్లు పోలీసులు చెబుతున్నారు. తీవ్ర గాయాలతో కొందరు ప్రయాణికులు బైటపడ్డారు… ఘటనాస్థలికి చేరుకున్న వెంటనే వీరిని దగ్గర్లోని ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు పోలీసులు. ఇక చిన్నచిన్న గాయాలపాలైనవారిని అక్కడే ప్రథమ చికిత్స అందించారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. రోడ్డుపైనే బస్సు దగ్దం కావడంతో హైదరాబాద్-బెంగళూరు హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి :  Naa Anveshana | ఒక్క వీడియోతో అన్వేష్ కెరీర్‌కు భారీ దెబ్బ.. 24 గంటల్లో ఎంతమంది అన్‌సబ్‌స్క్రైబ్ చేశారంటే..!
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page