📄 ePaper
Monday, April 13, 2026
📄 ePaper
HomeEducationMediguda Ashram School : మేడిగూడ ఆశ్రమ బాలికల పాఠశాలలో నిత్యావసర సరకులు పక్కదారి

Mediguda Ashram School : మేడిగూడ ఆశ్రమ బాలికల పాఠశాలలో నిత్యావసర సరకులు పక్కదారి

• హెడ్ మాస్టర్, వార్డెన్ లను సస్పెండ్ చేయాలి

• తుడుం దెబ్బ నాయకుల డిమాండ్

• ఏటిడిఓ కూ వినతి పత్రం అందజేత

వాస్తవ నేస్తం,ఇచ్చోడ : మండలంలోని మేడిగూడ (Tribal welfare girls residential School) గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల లో నిత్యావసర సరకుల్ని పక్కదారి పట్టించిన హెడ్ మాస్టర్ దీప్తి , వార్డెన్ శాంత ను వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేయాలని తుడుం దెబ్బ బోథ్ డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆత్రం మహేందర్, మేడిగూడ గ్రామ పటేల్ భీమ్ రావ్ డిమాండ్ చేశారు. వసతి గృహాల్లో అభ్యసిస్తున్న గిరిజన బాలికల సంక్షేమానికి ప్రభుత్వాలు సరఫరా చేస్తున్న నిత్యా వసర సరకులను హెడ్ మాస్టర్, వార్డెన్ లు కలిసి పక్కదారి పట్టించడం ఎంత వరకు సమంజసమని అన్నారు. సరకులను అమ్ముకోవడం సిగ్గు చేటని వారు పేర్కొన్నారు.

ఆటోలో తరలిస్తున్న పాఠశాలకు చెందిన నిత్యవసర సరుకులు

గత నెల రోజుల నుంచి విద్యార్థినీలకు మెనూ ప్రకారం భోజనాలు పెట్టడం లేరని, వారి పద్ధతి మార్చు కోవాలని పలుసార్లు విన్నవించినా హెడ్ మాస్టర్, వార్డెన్ పట్టించుకోవడం లేరని వారు ఆరోపించారు. తక్షణమే హెడ్ మాస్టర్, వార్డెన్ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఇచ్చోడలో ఏటిడిఓ కూ వినతి పత్రాన్ని అందజేశారు. లేనియెడల గిరిజన సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని వారు హెచ్చరించారు.

 

ఇది కూడా చదవండి :  Social media post : మత విద్వేషాలు రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టితే కఠిన చర్యలు
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page