• ఇద్దరు మృతి… పలువురికి తీవ్ర గాయాలు
• జాతీయ రహదారిపై బోథ్ ఎక్స్ రోడ్ వద్ద ఘటన
వాస్తవ నేస్తం, ఆదిలాబాద్: ప్రైవేట్ ట్రావెల్ లారీని (Private Travels Accident) వెనుక నుండి ఢీకొనడంతో ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈరోజు తెల్లవారుజామున (ఆదివారం) హైదరాబాద్ నుండి ప్రయాణికులతో యూపీ లోని గోరఖ్ పూర్ (MP Gorakhpur) వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్ బస్ జాతీయ రహదారి 44 (National Highway) పై బోథ్ ఎక్స్ రోడ్ వద్ద లారీని వెనుకనులు ఢీకొనడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని రిమ్స్ కు తరలించారు.
