📄 ePaper
Monday, March 16, 2026
📄 ePaper
HomeTelanganaAdilabadచిత్తశుద్ధి లేని ప్రభుత్వంతో రైతులకు ఇబ్బంది : బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్

చిత్తశుద్ధి లేని ప్రభుత్వంతో రైతులకు ఇబ్బంది : బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్

వాస్తవ నేస్తం,ఇచ్చోడ: రైతుల సమస్యలపై చిత్తశుద్ధి లేని ప్రభుత్వంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఆదివారం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రబ్బీ సీజన్ ప్రారంభమైన కూడా పంట కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వం ప్రారంభించకుండా రైతుల పొట్ట కొట్టి దళారుల పొట్ట నింపుతోందన్నారు. రెండు సంవత్సరాలు గడుస్తున్న కూడా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతోనే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కుమ్రం సత్యవతి కోటేశ్వర్, బిఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ ప్రీతం రెడ్డి, నాయకులు పాండురంగ్, సుభాష్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి :  నేనే up coming MPTC..!?
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page