📄 ePaper
Saturday, March 14, 2026
📄 ePaper
HomeTelanganaAdilabadమృతికి కారణమైన వ్యక్తిని అరెస్టు చేయాలి..

మృతికి కారణమైన వ్యక్తిని అరెస్టు చేయాలి..

• బాధిత కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని రోడ్డుపై ధర్నా 

వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: అజాగ్రత్తగా కారు నడిపి ఓ మహిళ మృతికి కారణమైన వ్యక్తి పై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు రోడ్డుపై ధర్నా చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలో ఆదివారం ఓ మహిళ వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న క్రమంలో ఓ కారు ఆ మహిళను ఢీకొంది (car accident) ఈ ప్రమాదంలో మహిళకు గాయాలయ్యాయి. గాయాలైన మహిళను జిల్లా కేంద్రంలోని రిమ్స్ తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మహిళా మృతి చెందింది. దీంతో గ్రామస్తులు, మహిళ కుటుంబ సభ్యులు రోడ్డుపై రోడ్డుపై బైఠాయించి అజాగ్రత్త కారు నడిపి మహిళా మృతికి కారణమైన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలి అని బజార్హత్నూర్ రోడ్డుపై బైటాయించి ధర్నా చేపట్టారు. దాదాపు రెండు గంటల నుండి ధర్నా చేపటగా పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి.

ఇది కూడా చదవండి :  ప్రతి రైతుకు అవసరాలకు సరిపడా యూరియాను అందించాలి
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page