• మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలి
• జీవో నెంబర్ 51 ని సవరించాలి
• సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బొజ్జ ఆశన్న
వాస్తవ నేస్తం,ఇచ్చోడ : మహబూబాద్ జిల్లా గార్లలో ఈ నెల 24, 25 న గ్రామపంచాయతీ ఎంప్లాయిస్, వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర 5 వ మహా సభలను నిర్వహిస్తున్నట్లు సిఐటియు జిల్లా అధ్య క్షులు బొజ్జ ఆశన్న తెలిపారు. మహాసభలకు సంబం ధించిన వాల్ పోస్టర్లను బుధవారం ఇచ్చోడలో సిఐ టియు నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలో భాగంగా పంచాయతీ సిబ్బందిని పర్మినెంట్ చేసి, వేతనాలు పెంచాలన్నారు. పంచాయతీ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ. 5 లక్షలు, ఇన్సూరెన్స్, ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు . జీవో నెంబర్ 51 ని సవరించి, మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, పాత కేటగిరీలన్నింటినీ కొనసాగించాల న్నారు. చాలామంది గ్రామపంచాయతీ వర్కర్స్ అనారోగ్యానికి గురై మృతి చెందుతున్నారని, బాధిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశాన్ని కల్పించా లన్నారు. మరణించిన కార్మికుని దహన సంస్కారా లకు రూ. 20,000 చెల్లించి, కార్మికులందరికీ ఇంది రమ్మ ఇండ్లు నిర్మించి, ఇళ్ల స్థలాన్ని కేటాయించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తున్న సిఐటియు అను బంధ గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ మహాసభల విజయవంతం కోసం ప్రతి ఒక్కరూ తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వర్కర్స్ ఇచ్చోడ మండల అధ్యక్ష, కార్యదర్శి సుంచు రవి, అంజయ్య మండల ఉపాధ్యక్షులు దుబ్బాక రామక్క ఆశన్న, మహమ్మద్, లక్ష్మణ్ , సాహెబ్ రావ్, సూర్య వంశీ, మచ్చ నారా యణ, అడేళ్ల, చిన్నక్క, గంగమ్మ, ఎల్లమ్మ రాజేశ్వర్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
