📄 ePaper
Wednesday, April 22, 2026
📄 ePaper
HomeBusinessGold 2026 | 2026లో బంగారం: అనిశ్చితి యుగంలో రికార్డుల దిశగా పసిడి.. కేంద్ర బ్యాంకులే...

Gold 2026 | 2026లో బంగారం: అనిశ్చితి యుగంలో రికార్డుల దిశగా పసిడి.. కేంద్ర బ్యాంకులే గేమ్‌చేంజర్

ప్రపంచ మార్కెట్లలో బంగారం ధరల పెరుగుదల ధరల పెరుగుదల ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గత సంవత్సరం నుండి పసిడి ధరలు క్రమ క్రమంగా పెరుగుకుంటూ 2026 సంవత్సరంలో ఆకాశాన్ని అంటుతున్నాయి. 2025లోనే చరిత్రాత్మక స్థాయిలను తాకిన పసిడి, 2026లో మరింత ఎత్తులకు ఎగబాకే సంకేతాలు ఇస్తోంది. కేవలం రిటైల్ డిమాండ్‌ లేదా పండుగల కొనుగోళ్లు మాత్రమే కాదు… ఇప్పుడు ప్రపంచ ఆర్థిక,రాజకీయ సమీకరణాలే బంగారం దిశను నిర్ణయిస్తున్నాయి. కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, భౌగోళిక ఉద్రిక్తతలు, ఫెడ్ విధానాలు ఈ మూడింటి కలయికే 2026 గోల్డ్‌ స్టోరీకి అసలైన డ్రైవర్‌గా మారింది.

కేంద్ర బ్యాంకుల వ్యూహం.. నిల్వల విభిన్నీకరణే ఇంధనం..

గత ఐదేళ్లలో బంగారం ధర దాదాపు 184 శాతం పెరిగిందంటే ఇది యాదృచ్ఛికం కాదు. 2025లోనే 63 శాతం లాభం నమోదు కావడం, పెట్టుబడిదారులకు భారీ రిటర్న్స్ అందించడం వెనుక ‘సెంట్రల్ బ్యాంక్ ఫ్యాక్టర్’ కీలకం. ముఖ్యంగా చైనా, భారత్ సహా పలు ఆసియా దేశాలు తమ విదేశీ మారకద్రవ్య నిల్వల్లో డాలర్‌పై ఆధారాన్ని తగ్గించి, బంగారాన్ని పెంచుకుంటున్నాయి. ఇది మార్కెట్‌లో స్థిరమైన, దీర్ఘకాలిక డిమాండ్‌ను సృష్టిస్తోంది. వాల్‌స్ట్రీట్‌ అంచనాలు కూడా ఈ ట్రెండ్‌ను బలపరుస్తున్నాయి. Jefferies Group 2026 నాటికి ఔన్సు బంగారం ధర $6,600 వరకు చేరవచ్చని అంచనా వేయగా, Yardeni $6,000, UBS $5,400 లక్ష్యాలను సూచించాయి. JPMorgan, Charles Schwab సుమారు $5,055 వద్ద స్థిరపడవచ్చని భావిస్తున్నాయి. Bank of America, ANZ కూడా $5,000 మైలురాయి సాధ్యమేనని చెబుతున్నాయి. మరింత జాగ్రత్తగా ఉన్న Goldman Sachs $4,900, Deutsche Bank $4,950, Morgan Stanley–Standard Chartered $4,800, Wells Fargo $4,500–$4,700 పరిధిని సూచించాయి.

ఇది కూడా చదవండి :  Gold | ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్ నామినేషన్.. బంగారం, వెండి, క్రిప్టో మార్కెట్లలో భారీ పతనం

ఫెడ్ నిర్ణయాలు,డాలర్ బలం.. రెండూ కీలకమే

2026లో బంగారం గమనాన్ని నిర్ణయించే మరో పెద్ద అంశం అమెరికా ఫెడరల్ రిజర్వ్. వడ్డీ రేట్లు తగ్గితే, వడ్డీ రాని ఆస్తి అయిన బంగారానికి డిమాండ్ పెరుగుతుంది. అదే సమయంలో డాలర్ బలహీనపడితే, అంతర్జాతీయంగా బంగారం మరింత ఆకర్షణీయంగా మారుతుంది. ఈ రెండు పరిస్థితులు కలిసి వస్తే, గోల్డ్‌ ర్యాలీ వేగం మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక ‘సేఫ్ హావెన్’ డిమాండ్ కూడా బలంగా కొనసాగుతోంది. రష్యా,ఉక్రెయిన్ యుద్ధం, మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు, వాణిజ్య ఘర్షణలు, రాజకీయ అనిశ్చితి ఇవన్నీ పెట్టుబడిదారులను రిస్కీ అసెట్స్‌ నుంచి సురక్షిత ఆస్తుల వైపు నడిపిస్తున్నాయి. ద్రవ్యోల్బణ భయాలు కూడా బంగారానికి అండగా నిలుస్తున్నాయి. కరెన్సీ విలువలు పడిపోతాయనే ఆందోళన ఉన్నప్పుడు, బంగారం విలువను కాపాడే ‘హెడ్జ్’గా మారుతోంది.

అయితే మార్కెట్‌లో అప్పుడప్పుడు దిద్దుబాట్లు (కరెక్షన్లు) తప్పవని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడితే లేదా జియోపాలిటికల్ టెన్షన్లు తగ్గితే, స్వల్పకాలికంగా ధరలు తగ్గే అవకాశం ఉంది. అయినప్పటికీ, దీర్ఘకాలంలో బంగారంపై బుల్లిష్ దృక్పథమే బలంగా కనిపిస్తోంది.

Gold bars stacked with rising market graph representing 2026 gold price forecast and central bank buying
Gold expected to hit new highs in 2026 as central banks increase purchases amid global uncertainty

మొత్తానికి 2026లో బంగారం సగటున $4,600–$5,000 పరిధిని దాటే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అత్యంత ఆశావహ అంచనాలు అయితే ఇంకా పైస్థాయిలను సూచిస్తున్నాయి. కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, సేఫ్ హావెన్ డిమాండ్, ఫెడ్ విధానాలు, ప్రపంచ అనిశ్చితి ఈ నాలుగు కలిస్తే 2026 బంగారం చరిత్రలో మరో రికార్డు ఏడాదిగా నిలిచే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి :  Gold Updates | బంగారం అలారం మోగిస్తోంది..! ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముందు పెద్ద షాక్‌నా..?

2026వ సంవత్సరంలో బంగారం కేవలం కమోడిటీ కాదు.. ఇది గ్లోబల్ పాలసీ సూచికగా మారుతోంది. కేంద్ర బ్యాంకుల వ్యూహాలు, ఫెడ్ నిర్ణయాలే ర్యాలీని నిర్ణయిస్తాయి. స్వల్పకాలిక ఒడిదుడుకులు ఉన్నా, దీర్ఘకాలంలో గోల్డ్‌ బలమైన ఆస్తిగానే నిలుస్తుంది. పై అంశాల ఆధారంగా చూసుకుంటే భవిష్యత్తులో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Written by: Qamar SD, Vaasthava Nestham Editorial Team,Published: January 20, 2025 | 08:23 AM

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page

https://man2bantul.id/https://portal.man2bantul.id/https://sirekap.man2bantul.id/https://eptsp.man2bantul.id/https://smkn5balam.com/https://tuluskartika.or.id/https://smptk.tuluskartika.or.id/https://www.stai-nurulhidayah.ac.id/https://journal.stai-nurulhidayah.ac.id/https://ejurnal.stai-nurulhidayah.ac.id/https://tical2025.redclara.net/https://uptdselatan.com/masterpoker99masterpoker99masterpoker99poker757poker757
masterpoker99masterpoker99masterpoker99masterpoker99inifun88inifun88inifun88https://jrdindustry.com/inifun88inifun88inifun88inifun88inifun88vovo88vovo88vovo88vovo88vovo88
inifun88inifun 88inifun88 logininipokerini pokerinipoker loginvovo88vovo88vovo88vovo88inifun88inifun88inifun88vovo88