భారతదేశపు మొట్టమొదటి, ఏకైక మహిళా ప్రధానమంత్రి. 1966 నుండి 1977 వరకు వరుసగా 3 పర్యాయాలు,1980లో 4 వ పర్యాయం ప్రధానమంత్రిగా పనిచేసారు. ఆమె భారత తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఏకైక కుమార్తె ఇందిరాగాంధీ జవహర్ లాల్ నెహ్రు కి మొదటి సారి ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రికి కార్యదర్శిగా జీతం లేకుండా పనిచేసారు. 1964 సంవత్సరములో తండ్రి మరణం తరువాత రాజ్యసభకు ఎన్నిక అయ్యారు. లాల్ బహదుర్ శాస్త్రి మంత్రి మండలిలో ప్రసార శాఖ మంత్రిగా పనిచేసిన ఉక్కు మహిళ గా (iron lady) ప్రసిద్ది చెందిన మహిళ ఇందిరాగాంధీ.
భారతదేశపు కీర్తిని ప్రపంచం నలుమూలలా చాటిచెప్పిన ఉక్కు మహిళ (iron lady) ఇందిరాగాంధీ. ఆమె రాజకీయ, వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొని శక్తిమంతమైన నాయకురాలిగా భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఇందిరాగాంధీ దేశానికి అందించిన నిరుపమాన సేవలు నాటి తరం నాయకులకే కాదు నేటితరం నాయకులకు సైతం స్ఫూర్తిదాయకం. ఇందిరాగాంధీ (Indira Gandhi) 1917 నవంబర్ 19న అలహాబాద్ లోని ఆనంద్ భవన్ లో భారత దేశపు తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ , కమలా నెహ్రూ దంపతులకు జన్మించారు. ఆమె అసలు పేరు ఇందిరా ప్రియదర్శిని. కాగా, లండన్ లోని ఆక్స్‌ఫర్డ్ (Oxford University – London) యూనివర్సిటీలో చదువుకునే సమయంలో పాత్రికేయుడు ఫిరోజ్ తో స్నేహం ప్రేమగా మారి వివాహానికి దారి తీసింది.
Iron lady Indira Gandhi | కారాగారంలో ఉండగానే మగ పిల్లవాడికి తల్లి :
వీరిద్దరి కుల, మతాలు వేరైనా 1942లో ఇందిర, ఫిరోజ్ ల వివాహం జరిగింది. ఆమెకు ఇద్దరు కుమారులు. 1955లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, పార్టీ (Congress party) ఎన్నికల కమిటీలలో సభ్యురాలిగా నియమితులయ్యారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమం (Quit India Movement) మొదలయింది. జవహర్ లాల్ నెహ్రూ (Jawaharlal Nehru) కారాగారం నుండి విడుదల అవుతూనే మళ్ళీ అరెస్టు అయ్యారు. గాంధీజీ కూడా అరెస్టు అయ్యారు. అరెస్టుకు నిరసనగా దేశమంతా సమ్మెలు జరిగాయి. అయితే బ్రిటిష్ వారు పోలీసు బలంతో సమ్మెలను అణచివేసారు. ఈ నేపథ్యంలో ఆమె అరెస్టు అయి కారాగారానికి వెళ్ళి 1943 మే 13న విడుదలయ్యారు. కారాగారంలో ఉండగానే ఆమె ఒక మగ పిల్లవాడికి తల్లి అయింది. ఆ పిల్లవాడికి రాజీవ్ (Rajiv Gandhi )అని పేరు పెట్టారు.
1964లో ఆమె తండ్రి, భారత తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ (Jawaharlal Nehru) మరణం అనంతరం ఇందిరా గాంధీ రాజ్యసభకు ఎన్నికైంది. లాల్ బహదూర్ శాస్త్రి మంత్రిమండలిలో ప్రసార శాఖ మంత్రిగా ఆమె సేవలు అందించింది. 1964 నుంచి 1966 వరకు సమాచార ప్రసార శాఖ మంత్రిగా ఉన్నారు. 1966 జనవరి నుంచి 1977 మార్చి వరకు భారత అత్యున్నత ప్రధానమంత్రి పదవిని అలంకరించారు. ఇదే కాలంలో 1967 సెప్టెంబర్ నుంచి 1977 మార్చి వరకు అణు ఇంధన శాఖ మంత్రిగా పనిచేశారు.
1967 సెప్టెంబర్ 5 నుంచి 1969 ఫిబ్రవరి 14 వరకు విదేశీ వ్యవహారాల మంత్రిగా అదనపు బాధ్యతలు నిర్వహించారు. 1970 జూన్ నుంచి 1973 నవంబర్ వరకు హోం మంత్రిత్వశాఖకు నాయకత్వం వహించారు. 1972 జూన్ నుంచి 1977 మార్చి వరకు అంతరిక్ష వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. 1980 జనవరి నుంచి ప్రణాళికా సంఘం ఛైర్ పర్సన్‌గా (planning commission chairman) వ్యవహరించారు. 1980 జనవరి 14న మళ్ళీ ప్రధానమంత్రి పదవిని చేపట్టారు.
ఈక్రమంలో 1966లో మొదటిసారి ప్రధానమంత్రి పదవీ బాధ్యతలు స్వీకరించిన దేశ మొదటి మహిళా ప్రధానిగా ఇందిరాగాంధీ (the first woman Prime Minister of India) చరిత్ర సృష్టించింది. కాగా, నేటి వరకు మరో మహిళ భారతదేశ ప్రధాని పదవిని అధిష్టించకపోవడం గమనార్హం. ఇందిరాగాంధీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎన్నో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారు. బ్యాంకుల జాతీయకరణ, జమీందారీ వ్యవస్థ రద్దు, గరీబీ హఠావో వంటి గొప్ప పథకాలతో భారతదేశ అత్యున్నత ప్రధానిగా ఇందిరాగాంధీ నిరూపించుకున్నారు.
Indira Gandhi | సమగ్ర దేశాభివృద్ధికి మార్గదర్శి :
‘ఆపరేషన్ బ్లూ స్టార్’లో (operation Blue Star) భాగంగా గోల్డెన్ టెంపుల్ (Golden Temple Amritsar)వద్ద సైనిక చర్య తర్వాత 1984 అక్టోబర్ 31న తన ఇద్దరు అంగరక్షకుల చేతిలో హత్యకు గురయ్యారు. ఆమె అంగరక్షకులలో ఒకరైన బియాంత్ సింగ్ (Niyanath Singh) తుపాకీతో ఆమెపై కాల్పులు జరిపాడు. అనంతరం మరో అంగరక్షకుడు సత్వంత్ సింగ్ తన తుపాకీతో ఇందిరా గాంధీ పై కాల్పులు జరపడంతో ఆమె నేలకొరిగారు. రక్తపు మడుగులో ఉన్న ఇందిరాగాంధీని ఎయిమ్స్ ( AIIMS hospital Delhi) ఆసుపత్రికి తరలించినా ఆమె ప్రాణాలు కాపాడలేకపోయారు. కాగా, ఇందిరాగాంధీ మరణం దేశానికి గొప్ప విషాదాన్ని, తీరని లోటును మిగిల్చింది. ఆమె దేశభక్తి, ధైర్య సాహసాలు, దేశాభివృద్ధికి ఆమె చూపిన మార్గం దేశ ప్రజల హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయింది. ఇందిరా గాంధీ భారతదేశ ఏకైక మహిళా ప్రధానమంత్రిగానే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా మహిళలకు స్ఫూర్తినిచ్చే నాయకురాలిగా కూడా ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. ప్రతి మహిళకు ఆమె చూపిన ధైర్యం, అంకితభావం నేటికీ స్ఫూర్తినిస్తోంది. భారతదేశ సమగ్ర అభివృద్ధికి తీసుకున్న కీలకమైన నిర్ణయాలు, సేవలను ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా మననం చేసుకుని ఉక్కు మహిళకు ఘనంగా నివాళి అర్పిద్దాం.
Indira Gandhi was the first woman Prime Minister of India | దేశ ప్రధానిగా విప్లవాత్మక నిర్ణయాలు :
ఇందిరాగాంధీ జనవరి 1966 నుంచి మార్చి 1977 వరకు, మళ్లీ జనవరి 1980 నుంచి అక్టోబర్ 1984లో ఆమె మరణించే వరకు భారత ప్రధాన మంత్రిగా విశిష్ట సేవలందించారు. ఇందిరా గాంధీ తన పాలనలో ప్రధానమైన ఆర్థిక, సాంకేతిక, భౌగోళిక అంశాలపై అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 1971లో పాకిస్తాన్పై విజయం, బంగ్లాదేశ్ ఏర్పాటులో కీలక పాత్రతో ఆమె అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడంతోపాటు భారత ప్రతిష్ఠను పెంచారు. గ్రీన్ రివల్యూషన్ (హరిత విప్లవం) దేశంలో ఆహార ఉత్పత్తులను పెంచడానికి దోహదపడింది. ఆమె ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమం భారతదేశంలో ఆకలి సమస్యను పరిష్కరించడంలో సహాయపడింది. 20 పాయింట్స్ కార్యక్రమం నిరుద్యోగం, పేదరిక నిర్మూలన, విద్య, ఆరోగ్య రంగాలలో సమగ్ర అభివృద్ధికి తోడ్పడింది. పేదలకు ప్రాధాన్యత కల్పించింది. ఇందిరా గాంధీ ‘భారతదేశపు ఉక్కు మహిళ’ గా ప్రపంచ దేశాల నాయకుల మన్ననలు పొందారు.
అక్టోబరు 31వ తేదీన ఢిల్లీ సఫ్దార్ జంగ్ రోడ్డులోని తన అధికార నివాసం నుంచి ఇందిర బయటకు వస్తుండగా ఉదయం సరిగ్గా 9.20 గంటలకు సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్ అనే ఇద్దరు సిక్కు గార్డులు ఆటోమేటిక్ వెపన్ల ద్వారా ఆమెపైకి 30 తూటాలు పేల్చారు. అందులో మూడు తూటాలు ఆమెకు తగలకుండా పక్క నుంచి దూసుకుపోగా, 20 తూటాలు ఆమె శరీరంలోకి ఓ పక్కనుంచి లోపలికెళ్లి మరో పక్కనుంచి బయటకు దూసుకెళ్లాయి. ఏడు తూటాలు ఆమె శరీరంలో దూసుకుపోయాయి. 9.30 గంటల సమయంలో ఆమెను హుటాహుటిన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆమె మరణాన్ని ఆస్పత్రి వర్గాలు ఆరోజు మధ్యాహ్నం 2.20 గంటలకు ధ్రువీకరించాయి. ఆరోజు సాయంత్రం వార్తల్లో దూరదర్శన్ ఇందిరాగాంధీ మరణాన్ని అధికారికంగా ప్రకటించింది.
సేకరణ: Mohammed Ghouse
