వాస్తవ నేస్తం,ఆదిలాబాద్ : సమాజానికి అందించిన విశేష సేవలందిస్తూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ప్రముఖులకు దక్కే గౌరవం ఆదిలాబాద్ జిల్లాను గర్వపడేలా చేసింది. సౌతాఫ్రికాలోని ప్రఖ్యాత వెల్లింగ్టన్ విశ్వవిద్యాలయం నుండి ప్రతిష్టాత్మక గౌరవ డాక్టరేట్ అందుకున్న డాక్టర్ సుధీర్ కుమార్ సంగెంను ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. బుధవారం స్థానిక కోర్టు పరిసరాల్లో జరిగిన ఈ అభినందన సభలో న్యాయవాదుల సంఘం సభ్యులు, సీనియర్ న్యాయవాదులు ఉత్సాహంగా పాల్గొని డాక్టర్ సుధీర్ కుమార్‌కు పూలమాలలు వేసి, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు నగేష్ మాట్లాడుతూ.. ఒక స్థానిక వ్యక్తి అంతర్జాతీయ స్థాయిలో డాక్టరేట్ అందుకోవడం ఆదిలాబాద్ వాసులందరికీ గర్వకారణమని కొనియాడారు.ఈ సన్మానం పట్ల డాక్టర్ సుధీర్ కుమార్ సంగెం కృతజ్ఞతలు తెలుపుతూ భావోద్వేగంగా మాట్లాడారు. ఈ ఘన సన్మానం ద్వారా సమాజం పట్ల తన ఉన్నత బాధ్యతలు, కర్తవ్యం మరింత పెరిగాయని, భవిష్యత్తులో ప్రజలకు మరింత సేవ చేసేందుకు ఈ గుర్తింపు తనకు రెట్టింపు ఉత్సాహాన్ని ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ,చందు సింగ్ , సెక్రటరీ కేమ శ్రీకాంత్ , కార్యవర్గ సభ్యులు కొర్రి రమణయ్య, భావన సింగ్, ముజాహిద్ ఉస్సేన్, సంగీత , సీనియర్ న్యాయవాదులు అమరేందర్ రెడ్డి, గంగారెడ్డి, సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
