వాస్తవ నేస్తం,ఇచ్చోడ: బొగ్గు లోడ్ తో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తాపడడంతో ఒకరు మృతిచెందగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రం గుండా వెళ్లే జాతీయ రహదారి పై , అయ్యప్ప ఆలయం సమీపంలో గురువారం తెల్లవారుజామున బొగ్గు లోడ్ తో, చంద్రాపూర్ నుండి నాందేడ్ వెళ్తున్న లారీ బోల్తా పడడంతో ఒకరు మృతి చెందారు. ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా క్షతగాత్రులను పోలీసులు చికిత్స కోసం రిమ్స్ కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.
🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్‌డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్‌లో వెంటనే చేరండి!
జాయిన్ వాస్తవ నేస్తం WhatsApp ఛానల్