📄 ePaper
Wednesday, April 22, 2026
📄 ePaper
HomeBusinessమదురో అరెస్టు తర్వాత వెలుగులోకి వచ్చిన వెనిజువెలా గోల్డ్ మిస్టరీ.. స్విట్జర్లాండ్‌కు తరలిన వేల కోట్ల...

మదురో అరెస్టు తర్వాత వెలుగులోకి వచ్చిన వెనిజువెలా గోల్డ్ మిస్టరీ.. స్విట్జర్లాండ్‌కు తరలిన వేల కోట్ల బంగారం

వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్: వెనిజువెలా రాజకీయాలు మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ఇప్పటికే ఆర్థిక సంక్షోభం, అంతర్జాతీయ ఆంక్షలతో కుదేలైన ఈ దక్షిణ అమెరికా దేశం ఇప్పుడు మరింత తీవ్రమైన పరిణామాల మధ్య చిక్కుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన అంశాలు వెనిజువెలా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురో చుట్టూ ఉన్న వివాదాలను మరో స్థాయికి తీసుకెళ్లాయి.

గత వారం కారకాస్‌లో చోటు చేసుకున్న దాడులు అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి. జనవరి 3న జరిగిన ఈ ఘటనలో అమెరికా ప్రత్యేక దళాలు నికోలస్ మదురోను అదుపులోకి తీసుకున్నాయనే సమాచారం సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఆయన న్యూయార్క్ కోర్టులో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, డ్రగ్ టెర్రరిజం వంటి తీవ్రమైన ఆరోపణలను ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది. అధికారిక ధృవీకరణలు పరిమితంగా ఉన్నప్పటికీ, ఈ వ్యవహారం వెనిజువెలా–అమెరికా సంబంధాలను మరింత ఉద్రిక్తంగా మార్చింది.

ఈ నేపథ్యంలో మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. మదురో అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే వెనిజువెలా దేశంలోని విలువైన బంగారు నిల్వలను భారీగా విదేశాలకు తరలించినట్టు కస్టమ్స్ డేటా వెల్లడిస్తోంది. 2013 నుంచి 2016 మధ్యకాలంలో వెనిజువెలా దాదాపు 4.14 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌ల విలువైన బంగారాన్ని స్విట్జర్లాండ్‌కు ఎగుమతి చేసినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇది సుమారు 5.2 బిలియన్ అమెరికన్ డాలర్లకు సమానం.

రాయిటర్స్ విశ్లేషణ ప్రకారం, ఈ కాలంలో వెనిజువెలా మొత్తం 113 మెట్రిక్ టన్నుల బంగారాన్ని స్విట్జర్లాండ్‌కు పంపింది. అదే సమయంలో దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. విదేశీ కరెన్సీ కొరత, అదుపు తప్పిన ద్రవ్యోల్బణం, చమురు ఆదాయాల పతనం వంటి సమస్యలు వెనిజువెలా ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేశాయి. ఈ పరిస్థితుల్లో కేంద్ర బ్యాంక్ తన బంగారు నిల్వలను విక్రయించి దేశాన్ని నిలబెట్టే ప్రయత్నం చేసినట్టు స్విస్ ప్రభుత్వ ప్రసార సంస్థ SRF నివేదించింది.

ఇది కూడా చదవండి :  Gold Wholesale Market : తక్కువ ధరకే బంగారం కొనాలా? భారతదేశ బంగారు హోల్‌సేల్ మార్కెట్ ఇదే!

అయితే 2017 తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. యూరోపియన్ యూనియన్ వెనిజువెలాపై ఆంక్షలు విధించిన తర్వాత బంగారం ఎగుమతులు ఒక్కసారిగా ఆగిపోయాయి. కస్టమ్స్ డేటా ప్రకారం 2017 నుంచి 2025 వరకు స్విట్జర్లాండ్‌కు వెనిజువెలా నుంచి ఒక్క గ్రాము బంగారం కూడా ఎగుమతి కాలేదు. మానవ హక్కుల ఉల్లంఘనలు, ప్రజాస్వామ్య విలువల అణచివేత ఆరోపణల నేపథ్యంలో 2017లో ఈయూ ఆంక్షలు విధించగా, 2018లో స్విట్జర్లాండ్ కూడా అదే మార్గాన్ని అనుసరించింది.

మదురో అరెస్టు వార్తల అనంతరం స్విట్జర్లాండ్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మదురోతో పాటు అతని 36 మంది అనుచరులకు సంబంధించిన ఆస్తులను స్విస్ భూభాగంలో స్తంభింపజేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ ఆస్తుల విలువ ఎంత, అవి ఏ వనరుల నుంచి వచ్చాయి అన్న విషయాలపై ఇప్పటివరకు స్పష్టత లేదు. గతంలో వెనిజువెలా కేంద్ర బ్యాంక్ నుంచి తరలించిన బంగారంతో ఈ ఆస్తులకు ఏమైనా సంబంధం ఉందా అనే అంశం ఇంకా అనుమానంగానే ఉంది.

నిపుణుల అంచనాల ప్రకారం, వెనిజువెలా బంగారాన్ని ప్రాసెసింగ్, నాణ్యత సర్టిఫికేషన్, తదుపరి అంతర్జాతీయ రవాణా కోసం స్విట్జర్లాండ్‌కు తరలించి ఉండవచ్చు. ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు శుద్ధి కేంద్రాల్లో స్విట్జర్లాండ్ ఒకటి కావడం గమనార్హం. అక్కడ పనిచేసే ఐదు ప్రధాన శుద్ధి కర్మాగారాలు గ్లోబల్ గోల్డ్ మార్కెట్‌లో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

స్టోన్‌ఎక్స్‌కు చెందిన మార్కెట్ విశ్లేషకురాలు రోనా ఓకానెల్ అభిప్రాయం ప్రకారం, 2012 నుంచి 2016 మధ్యకాలంలో వెనిజువెలా సెంట్రల్ బ్యాంక్ తీవ్రమైన ఒత్తిడిలో బంగారాన్ని విక్రయించింది. ఆ బంగారంలో పెద్ద భాగం స్విట్జర్లాండ్‌కు చేరి ఉండొచ్చని ఆమె అంచనా వేస్తున్నారు. ఆ తరువాత అది అక్కడే నిల్వగా ఉండి ఉండవచ్చు లేదా ఆసియా సహా ఇతర ప్రాంతాలకు చిన్న బార్‌ల రూపంలో విక్రయించబడిఉండవచ్చని ఆమె పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి :  Gold updates : బంగారం బుల్లిష్ అలర్ట్..! 2026 నాటికి ఔన్సు $6,000 లక్ష్యం : బ్యాంక్ ఆఫ్ అమెరికా సంచలన అంచనా

2017 తర్వాత బంగారం ఎగుమతులు పూర్తిగా ఆగిపోవడానికి మరో కారణం కూడా ఉందని నిపుణులు భావిస్తున్నారు. వెనిజువెలా కేంద్ర బ్యాంక్ వద్ద బంగారు నిల్వలు గణనీయంగా తగ్గిపోవడంతో ఇక ఎగుమతులకు అవకాశం లేకుండా పోయి ఉండవచ్చని వారు అంటున్నారు.

Venezuela gold reserves reportedly moved to Switzerland during Nicolas Maduro presidency
Venezuela gold reserves controversy deepens after Nicolas Maduro arrest

మొత్తంగా చూస్తే, మదురో అరెస్టు, బంగారు నిల్వల తరలింపు, ఆస్తుల స్తంభింపజేత వంటి అంశాలు వెనిజువెలా రాజకీయ–ఆర్థిక చరిత్రలో కీలక మలుపుగా మారుతున్నాయి. ఈ పరిణామాలు భవిష్యత్తులో అంతర్జాతీయ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆసక్తిగా గమనిస్తోంది.

Author: QAMAR SD

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page

https://man2bantul.id/https://portal.man2bantul.id/https://sirekap.man2bantul.id/https://eptsp.man2bantul.id/https://smkn5balam.com/https://tuluskartika.or.id/https://smptk.tuluskartika.or.id/https://www.stai-nurulhidayah.ac.id/https://journal.stai-nurulhidayah.ac.id/https://ejurnal.stai-nurulhidayah.ac.id/https://tical2025.redclara.net/https://uptdselatan.com/masterpoker99masterpoker99masterpoker99poker757poker757
masterpoker99masterpoker99masterpoker99masterpoker99inifun88inifun88inifun88https://jrdindustry.com/inifun88inifun88inifun88inifun88inifun88vovo88vovo88vovo88vovo88vovo88
inifun88inifun 88inifun88 logininipokerini pokerinipoker loginvovo88vovo88vovo88vovo88inifun88inifun88inifun88vovo88