• న్యాయవాది సుధీర్ కుమార్‌కు డే స్ప్రింగ్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్
• విశాఖ వేదికగా ప్రదానోత్సవం
• ఆదిలాబాద్ జిల్లాకు దక్కిన అరుదైన గౌరవం
వాస్తవ నేస్తం,ఆదిలాబాద్ : సమాజ సేవలో నిస్వార్థంగా అడుగులు వేస్తున్న ఓ మారుమూల జిల్లా న్యాయవాదికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. నాడు సౌతాఫ్రికా యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్న ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ప్రముఖ న్యాయవాది సుధీర్ కుమార్ సంగెం… నేడు ఏకంగా అగ్రరాజ్యం అమెరికాకు చెందిన యూనివర్సిటీ నుండి అదే స్థాయి సత్కారాన్ని అందుకున్నారు. ‘సంగెం చారిటబుల్ ట్రస్ట్’ స్థాపించి, సంవత్సరాల తరబడి ఆయన చేస్తున్న విశేష సామాజిక సేవలకు దక్కిన సముచిత స్థానం ఇది..
అమెరికాకు చెందిన ప్రఖ్యాత ‘డే స్ప్రింగ్ యూనివర్సిటీ’ సుధీర్ కుమార్ సేవలను గుర్తించి ఆయనకు ప్రతిష్ఠాత్మక గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది. ఈ నెల 25న విశాఖపట్నంలో జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో డే స్ప్రింగ్ వర్సిటీ అధ్యక్షులు డాక్టర్ పౌల్ శామ్యూల్, యూనివర్సిటీ చాన్సలర్ అమోల్ జేమ్స్, డాక్టర్ కెనిత్ హెండ్రి, చేయూత ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ చెన్నారావు, పీఎస్ఆర్ బిషప్ డాక్టర్ రోడ్రిక్స్ తదితర ప్రముఖులు పాల్గొని సుధీర్ కుమార్‌ను ఘనంగా సత్కరించి, డాక్టరేట్ పట్టాను అందజేశారు.
హర్షం వ్యక్తం చేస్తున్న జిల్లా వాసులు..
మారుమూల ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ సామాజిక కార్యకర్త, న్యాయవాది ఏకంగా అమెరికా యూనివర్సిటీ నుండి డాక్టరేట్ పొందడం పట్ల జిల్లా ప్రజలు, గ్రామస్తులు, తోటి న్యాయవాదులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది వ్యక్తిగతంగా ఆయనకే కాకుండా, ఆదిలాబాద్ జిల్లాకే దక్కిన గౌరవంగా వారు అభివర్ణిస్తున్నారు. అమెరికాకు చెందిన యూనివర్సిటీ నన్ను గుర్తించి గౌరవ డాక్టరేట్‌తో సన్మానించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ డాక్టరేట్ అవార్డు నాలో గర్వాన్ని కాకుండా, సమాజం పట్ల నాకున్న బాధ్యతను మరింత పెంచింది. నా తుది శ్వాస వరకు నిరుపేదలకు, ఆపదలో ఉన్నవారికి అండగా డాక్టర్ సుధీర్ కుమార్ సంగెం తెలిపారు.
🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్‌డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్‌లో వెంటనే చేరండి!
జాయిన్ వాస్తవ నేస్తం WhatsApp ఛానల్