HomePolitical NewsAIMIM MLC Rahmath Baig : రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు: ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా సస్పెన్షన్...

AIMIM MLC Rahmath Baig : రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు: ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా సస్పెన్షన్ వెనుక సంచలన ఆరోపణలు!

వాస్తవ నేస్తం, వెబ్ డెస్క్ : రాజకీయం ఎప్పుడూ అనూహ్య పరిణామాల వేదిక. తాజాగా తెలంగాణ రాజకీయాల్లో ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) పార్టీ తీసుకున్న ఒక సంచలన నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ మీర్జా రెహ్మత్ బేగ్‌ను సస్పెండ్ చేస్తూ ఎంఐఎం అధికారిక పేజీలో చేసిన ప్రకటన తీవ్ర చర్చకు దారి తీసింది. అయితే, ఈ సస్పెన్షన్ వెనుక ఉన్న కారణాలపై ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఊహాగానాలు, తీవ్రమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా వైరల్ అవుతున్న వార్తా కథనాల ప్రకారం.. ఈ సస్పెన్షన్ కేవలం క్రమశిక్షణా రాహిత్యానికి సంబంధించిన వ్యవహారం కాదని తెలుస్తోంది. ఎమ్మెల్సీ మీర్జాపై ఒక మహిళకు సంబంధించి తీవ్రమైన లైంగిక ఆరోపణలు (అత్యాచార యత్నం) వచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ క్రమంలోనే స్థానికులు ఆయనను పట్టుకున్నారనే వార్తలు కలకలం రేపుతున్నాయి. ప్రజాప్రతినిధిగా ఉన్న ఒక వ్యక్తిపై ఇలాంటి ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు. డ్యామేజ్ కంట్రోల్ చర్యల్లో భాగంగానే పార్టీ అధిష్టానం తక్షణమే ఆయనను సస్పెండ్ చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

అధినేతపై విమర్శల దాడి.. వైరల్ అవుతున్న వీడియో!

ఈ వివాదం కేవలం మీర్జా మీదే కాకుండా ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీకి కూడా సెగలు పుట్టిస్తోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ వ్యవహారం ఒవైసీకి ముందే తెలుసని పలువురు నాయకులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా, ఈ ఇష్యూను త్వరగా సెటిల్ చేసుకోవాలంటూ ఎమ్మెల్సీని అసదుద్దీన్ హెచ్చరించినట్లుగా చెబుతున్న ఒక వీడియో నెట్టింట వైరల్ కావడం ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసింది. ఈ పరిణామాలపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి నాయకులు స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీని సస్పెండ్ చేసినందుకు ఎంఐఎంకు ధన్యవాదాలు. అయితే, కేవలం సస్పెన్షన్ చేస్తే సరిపోదు. ఆ వేధింపులకు సంబంధించిన ఆధారాలను తక్షణమే పోలీసులకు అప్పగించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి” అని ఆయన డిమాండ్ చేశారు.

🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్‌డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్‌లో వెంటనే చేరండి!

జాయిన్ వాస్తవ నేస్తం WhatsApp ఛానల్
RELATED ARTICLES
- Advertisment -

Most Popular