• ఉత్సాహంగా మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు
• హాజరైన స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మార్పీఎస్ నాయకులు
వాస్తవ నేస్తం,ఇచ్చోడ: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలను నాయకులు, కార్యకర్తలు అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులు ముఖ్యాతిథులుగా హాజరయ్యారు. దళిత, బడుగు, బలహీన వర్గాల హక్కుల సాధన కోసం మందకృష్ణ మాదిగ చేస్తున్న కృషిని, ఎమ్మార్పీఎస్ పోరాటాలను ఈ సందర్భంగా నాయకులు కొనియాడారు.
ఈ వేడుకల్లో గ్రామ సర్పంచ్ జాకు, ఉప సర్పంచ్ శిరీష్ రెడ్డి, మాజీ ఎంపీపీ ప్రీతం రెడ్డి, ఎమ్మార్పీఎస్ నాయకులు దుబాక సుభాష్, సిరిసిల్ల భూమయ్య, మండల అధ్యక్షుడు చిట్టి రవి, కాష్పక విష్ణు, కల్లెపెల్లి రాజు, జుట్టు మల్లేష్, మచ్చ గంగయ్య, కొల్లూరు గంగయ్య, ఆరెపల్లి రవి, శీను, మసీదు నందు, జన్నారపు సాయి తదితరులు పాల్గొన్నారు.
