HomeTelanganaకాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా గాంధీజీ జయంతి

కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా గాంధీజీ జయంతి

📰 Generate e-Paper Clip

వాస్తవ నేస్తం,ఇచ్చోడ : మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీజీ 157వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు ముందుగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ… దేశ స్వాతంత్ర్యం కోసం గాంధీజీ చేసిన పోరాటాన్ని, ఆయన చూపిన అహింసా మార్గాన్ని స్మరించుకున్నారు. బాపూజీ ఆశయాలను, సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఆచరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కల్లెం నారాయణ రెడ్డి, ఏఎంసీ (AMC) చైర్మన్ సత్యవతి కోటేష్, ఆదిలాబాద్ జిల్లా ఎస్సీ (SC) సెల్ జనరల్ సెక్రటరీ కొత్తూరు లక్ష్మణ్, బోథ్ నియోజకవర్గ మైనార్టీ సెల్ చైర్మన్ మహమ్మద్ ముస్తఫా, బోథ్ నియోజకవర్గ ఎస్టీ (ST) సెల్ చైర్మన్ గంగారామ్, ఇచ్చోడ అధికార ప్రతినిధి బొజ్జ రవి, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ తుమ్ముల వెంకట్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబర్ ముజర్, మాజీ మైనార్టీ అధ్యక్షుడు రషీద్, నాయకులు కదం శివాజీ, కేంద్ర వినాయక్ తదితరులు పాల్గొన్నారు.

🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్‌డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్‌లో వెంటనే చేరండి!

జాయిన్ వాస్తవ నేస్తం WhatsApp ఛానల్
RELATED ARTICLES
- Advertisment -

Most Popular