HomePolitical Newsసోనాలకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు హర్షణీయం

సోనాలకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు హర్షణీయం

 * గ్రామీణ, గిరిజన విద్యార్థులకు వరం

 * సీఎం రేవంత్ రెడ్డి, ప్రజాప్రతినిధులకు తుల అరుణ్ కుమార్ కృతజ్ఞతలు

 

వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: బోథ్ నియోజకవర్గంలోని సోనాల మండలానికి ప్రతిష్టాత్మక తెలంగాణ పబ్లిక్ స్కూల్ (TPS) మంజూరు కావడం పట్ల ఏఐసీసీ ఇంటెలెక్చువల్ సెల్ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ తుల అరుణ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు పాఠశాల మంజూరుకు కృషి చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి శనివారం ఒక ప్రకటనలో ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ విద్యాసంస్థ మంజూరుకు సహకరించిన ముఖ్యమంత్రి సలహాదారు, రాజ్యసభ సభ్యులు వేమ్ నరేందర్ రెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్, మాజీ ఎంపీ సోయం బాపురావు, డీసీసీ అధ్యక్షులు నరేష్ జాధవ్, బోథ్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ అడే గజేందర్‌లకు అరుణ్ కుమార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

సోనాలకు పబ్లిక్ స్కూల్ సాధన కోసం పార్టీలకు అతీతంగా సహకరించిన ప్రతి ఒక్క ప్రజాప్రతినిధికి, అధికారులకు, ప్రజాసంఘాల నాయకులకు, విద్యావేత్తలకు మరియు ఈ ఉద్యమంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాలుపంచుకున్న ప్రజలందరికీ ఆయన పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. సోనాల మండల ప్రజలు, విద్యార్థులు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న కల ఈ మంజూరుతో నెరవేరిందని ఆయన పేర్కొన్నారు. ఈ పాఠశాల ఏర్పాటు ద్వారా గ్రామీణ, గిరిజన ప్రాంతాల విద్యార్థులకు అత్యుత్తమ నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తుందని సంతోషం వ్యక్తం చేశారు. ఇది బోథ్ నియోజకవర్గ విద్యాభివృద్ధి చరిత్రలో ఒక సువర్ణాధ్యాయంగా నిలిచిపోతుందని అరుణ్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular