HomeTelanganaHydrabadతహసీల్దార్ కార్యాలయంలో రైతు మృతి ఘటనపై హెచ్‌‌ఆర్‌సీకి ఫిర్యాదు

తహసీల్దార్ కార్యాలయంలో రైతు మృతి ఘటనపై హెచ్‌‌ఆర్‌సీకి ఫిర్యాదు

📰 Generate e-Paper Clip

• సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి: సీసీవీ డిమాండ్

వాస్తవ నేస్తం,హైదరాబాద్: కోయిల్‌కొండ మండల తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో అక్టోబర్ 3న రైతు మృతి చెందిన ఘటనపై సమగ్ర, నిష్పాక్షిక విచారణ జరిపించాలని ‘కౌన్సిల్ ఫర్ సిటిజన్స్ వాయిస్’ (సీసీవీ) డిమాండ్ చేసింది. ఈ మేరకు సంస్థ ప్రతినిధులు నరేష్ బాబు, మణికంఠ, రామ మోహన్ సంబంధిత మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. రైతు మృతికి దారితీసిన పరిస్థితులతో పాటు ఆయన లేదా ఆయన కుటుంబ సభ్యులు సమర్పించిన దరఖాస్తుల పరిష్కారంలో ఏవైనా పరిపాలనా జాప్యం, నిర్లక్ష్యం లేదా బాధ్యతారాహిత్యం చోటుచేసుకున్నాయా అనే అంశాలను అధికారిక రికార్డుల ఆధారంగా లోతుగా పరిశీలించాలని వినతిపత్రంలో కోరారు. మృతుడు సమర్పించిన దరఖాస్తులు, ఇన్వర్డ్ రికార్డులు, రెవెన్యూ ఫైళ్లు, ఫైల్ మూవ్‌మెంట్ వివరాలతో పాటు పోలీస్ ఎఫ్‌ఐఆర్, ఇన్‌క్వెస్ట్ పంచనామా, పోస్టుమార్టం నివేదికలను క్షుణ్ణంగా పరిశీలించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. విచారణలో అధికారుల లోపం లేదా నిర్లక్ష్యం ఉన్నట్లు నిర్ధారణ అయితే చట్టప్రకారం బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్‌లో ఉన్న ప్రజా ఫిర్యాదులు, దరఖాస్తులను ‘సిటిజన్ చార్టర్’ మరియు నిర్ణీత కాలపరిమితులకు అనుగుణంగా పరిష్కరించే విధానాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలని సీసీవీ ప్రతినిధులు సూచించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర ‘డిజిటల్ గ్రీవెన్స్ ట్రాకింగ్ వ్యవస్థ’ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతి ఫిర్యాదుకు ప్రత్యేక గ్రీవెన్స్ ఐడీ, డిజిటల్ రసీదు, నిర్ణీత పరిష్కార గడువు, ఆన్‌లైన్ స్టేటస్ ట్రాకింగ్ సౌకర్యాలు కల్పించాలని, గడువు దాటితే తదుపరి అధికారికి ‘ఆటోమేటిక్ ఎస్కలేషన్’ అయ్యేలా పారదర్శక వ్యవస్థను రూపొందించాలని కోరారు.

ప్రస్తుతం వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్‌లో ఉన్న ప్రజా ఫిర్యాదులు, దరఖాస్తుల స్థితిపై ప్రభుత్వం తక్షణమే సమగ్ర సమీక్ష నిర్వహించి, తగిన ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రజా ప్రయోజనాల వినతిపత్రం ఎటువంటి వ్యక్తిగత లేదా ఆస్తి ప్రయోజనం కోసం కాకుండా కేవలం ప్రజా ప్రయోజనం, పరిపాలనా జవాబుదారీతనం, పారదర్శకత మరియు మానవ హక్కుల పరిరక్షణ కోసమే సమర్పించినట్లు సీసీవీ ప్రతినిధులు వెల్లడించారు.

🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్‌డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్‌లో వెంటనే చేరండి!

జాయిన్ వాస్తవ నేస్తం WhatsApp ఛానల్
RELATED ARTICLES
- Advertisment -

Most Popular