e-paper
Thursday, January 8, 2026
HomeCrime Newsరూ.39 లక్షలమొబైల్ ఫోన్లు బాధితులకు తిరిగి అందజేత

రూ.39 లక్షలమొబైల్ ఫోన్లు బాధితులకు తిరిగి అందజేత

• ఇప్పటివరకు 1500 మొబైల్ ఫోన్లు బాధితులకు తిరిగి అందజేత

• 40 రోజుల వ్యవధిలో 200 మొబైల్ ఫోన్లు తిరిగి సంపాదించిన బృందం

• జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ 

వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: నేడు మొబైల్ ఫోన్ లేనిదే ఎలాంటి పని జరగదు. మొబైల్ ఫోన్లో అన్ని వివరాలు, అన్ని జ్ఞాపకాలు, అన్ని లావాదేవీలకు సంబంధించిన అప్లికేషన్లు ఉంటాయి, సాధారణంగా ప్రజలు మొబైల్ ఫోన్లు పోగొట్టుకోవడం, దొంగలించబడటం జరుగుతుంది. తిరిగి వాటిని సంపాదించాలంటే, ఈ సందర్భంలో బాధితులు వెంటనే https://www.ceir.gov.in అనే వెబ్సైట్ లో లేదా దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ (SP Akhil Mahajan) తెలియజేశారు. ఆదిలాబాద్ జిల్లాలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను తిరిగి సంపాదించడం కోసం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రత్యేకంగా రికవరీ బృందాన్ని ఏర్పాటు చేశారని. గత 40 రోజుల వ్యవధిలో దాదాపు వివిధ రాష్ట్రాల నుండి జిల్లాల నుండి బాధితులు పోగొట్టుకున్నటువంటి, దొంగలించబడినటువంటి 200 మొబైల్ ఫోన్ లను తిరిగి రాబట్టరు. ఇలా ఇంత మొత్తంలో రాబట్టడం జిల్లాలోనే ప్రథమం, మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న బాధితులు దాదాపు మధ్యతరగతి కుటుంబీకులు, బీదవారు వారు ఎంతగానో కష్టపడి కొనుక్కున్న మొబైల్ ఫోన్ను తిరిగి వారికి అందజేయాలని సదుద్దేశంతో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఈ బృందాన్ని ఏర్పాటు చేశారు. మొబైల్ ఫోన్ దొంగతనాలు జరిగే ప్రాంతాలు రైతు బజార్, రిమ్స్, రైల్వే స్టేషన్, బస్టాండ్, ఇళ్లలో దొంగతనాలు, బంధువులకు ఫోన్ చేస్తానంటూ ఫోన్ తస్కరించడం లాంటివి జరుగుతున్నాయని వాటి వల్ల అప్రమత్తంగా ఉండాలని జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. మొబైల్ ఫోన్లను తిరిగి ఇచ్చే క్రమంలో గురువారం స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్ సమావేశం మందిరంలో ఆదిలాబాద్ జిల్లాలో మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న, చోరీకి గురైనటువంటి బాధితులకు 200 మొబైల్ ఫోన్లు (దాదాపు 39.1 లక్షల విలువ చేసే ) వివిధ ప్రాంతాల నుండి తెప్పించి బాధితులకు తిరిగి అందజేశారు. నూతన సంవత్సరం సందర్భంగా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను తిరిగి అందుకున్న బాధితులు సంతోషం వ్యక్తం చేస్తూ, జిల్లా ఎస్పీకి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 1500 మొబైల్ ఫోన్లను బాధితులకు తిరిగి అందజేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు.

ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని ప్రతి నెల రోజుల లో పోగొట్టుకున్నటువంటి మొబైల్ ఫోన్లను తిరిగి రాబట్టి బాధితులకు అందజేయడం జరుగుతుందని హామీ ఇచ్చారు. బాధితులు మొబైల్ ఫోన్లు (mobile phones) పోగొట్టుకున్న వెంటనే పోలీస్ స్టేషన్ లను సంప్రదించాలని తెలిపారు. మొబైల్ ఫోన్ దుకాణాల యజమానులు, రిపేరింగ్ దుకాణాల యజమానులు, మొబైల్ ఫోను కొనే ముందు మొబైల్ ఫోన్ యజమాని అనుమతి సరైన పత్రాలు తీసుకోవాలి, దొంగ మొబైల్ ఫోన్లు కొన్న ఎడల వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. ముఖ్యంగా రాబట్టిన మొబైల్ ఫోన్లు ఉత్తర భారతదేశంలో ఉండటం వాటిని ప్రత్యేక బృందం ఆధ్వర్యంలో తిరిగి రాబట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్ ఏఎస్పీ మౌనిక , శిక్షణ ఐపిఎస్ రాహుల్ కాంత్, అదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి, ప్రత్యేక బృందం సభ్యులు ఆర్ఎస్ఐ గోపి కృష్ణ, రియాస్, మజీద్, త్రిశూల్, అన్వేష్, నవనీత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page