e-paper
Wednesday, December 17, 2025
HomeCrime NewsLok Adalat |  లోక్ అదాలత్ కు భారీ స్పందన : జిల్లా ఎస్పీ అఖిల్...

Lok Adalat |  లోక్ అదాలత్ కు భారీ స్పందన : జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

• 3538 కేసుల పరిష్కారం

• సైబర్ క్రైమ్ కేసులలో బాధితులకు రూ 1,25,853/- తిరిగి అందజేత

వాస్తవ నేస్తం,ఆదిలాబాద్:  ఈనెల 15వ తేదీన నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమానికి జిల్లా ప్రజల నుండి భారీ స్పందన వచ్చిందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలియజేశారు. ఆదివారం ఒక పత్రిక ప్రకటనలో వివరాలు వెల్లడించారు. రాజీమార్గమే రాజమార్గం అంటూ జిల్లా ప్రజలు విశేష స్పందనను చూయించి రాజి కుదుర్చుకొని ఇరు వర్గాల కాక్షి దారులు విజయవంతంగా కేసులను పూర్తి చేసుకున్నారని తెలిపారు. జిల్లాలోని పరిష్కరించబడిన కేసులు మొత్తం 3538 కేసులుగా గుర్తించబడినదని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా నమోదైన 57 సైబర్ క్రైమ్ కేసులలో (cyber crime case) బాధితులు పోగొట్టుకున్న 10,50,880/- ఉత్తర్వులు వచ్చినట్టు, వచ్చిన వాటిలో డబ్బులో రూ 1,25,853/- తిరిగి వారి అకౌంట్లో జమ అయినట్టు తెలిపారు. ఎఫ్ఐఆర్ కేసులలో ఈ పెట్టి కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్ (drunk and drive )కేసులు, ఎక్సైజ్ కేసులు, నేర నిరూపణ ఉన్న నిందితులు స్వయంగా న్యాయస్థానాలకు హాజరై తప్పులను ఒప్పుకోవడంతో ఈ కేసులను పరిష్కరించినట్లు తెలిపారు. పోలీస్ స్టేషన్ (FRI) లలో నమోదైన క్రిమినల్ కేసులు, నిందితులు బాధితులు కలిసి హాజరై రాజీమార్గంలో రాజీ పడటంతో కేసులను కొట్టివేసినట్లు తెలిపారు. కేసులను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తూ విధులను నిర్వర్తించిన కోర్టు డ్యూటీ అధికారులను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా పోలీసు వ్యవస్థతో వివిధ సమావేశాలు ఏర్పాటు చేస్తూ లోక్ అదాలత్ విజయవంతం కావడానికి కృషి చేసిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి కే ప్రభాకర్ రావు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు పోలీస్ శాఖ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతిరోజు శాంతి భద్రతల సమస్యలను పరిరక్షిస్తూ అదేవిధంగా కోర్టు డ్యూటీ విధులను పర్యవేక్షిస్తూ లోక్ అదాలత్ విజయవంతం కావడానికి కృషిచేసిన పోలీసు సిబ్బంది ఆదిలాబాద్ డిఎస్పిఎల్ జీవన్ రెడ్డి, సైబర్ క్రైమ్ డిఎస్పి హసిబిల్లా, ఎస్ఐలు నరేష్, హకీం, సిబ్బంది వెంకటమ్మ, సుభాష్ యాదవ్, శ్రీనివాస్, లఖన్, వినోద్ సిబ్బంది తదితరులను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page