📄 ePaper
Thursday, March 26, 2026
📄 ePaper
HomeTelanganaAdilabadBC JAc : మండల బీసీ అఖిలపక్ష జేఏసీ ఎన్నిక

BC JAc : మండల బీసీ అఖిలపక్ష జేఏసీ ఎన్నిక

జేఏసీ మండల అధ్యక్షులుగా నరాల రమణయ్య

వాస్తవ నేస్తం,ఇచ్చోడ: మండల కేంద్రంలో శనివారం మండల బీసీ అఖిలపక్ష జేఏసీ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అఖిలపక్ష జేఏసీ గౌరవ అధ్యక్షులుగా గాడ్గే సుభాష్ , మండల అధ్యక్షులుగా నరాల రమణయ్య, ఉపాధ్యక్షులుగా అంబేకర్ పాండురంగ్, ముండే పాండురంగ్, మాధవరావు ఆమ్టే, షేక్ ముస్తఫా, షఫీ అహ్మద్, టెహేరే రమేష్, సామాన్పల్లి సుదర్శన్, తృప్తి గంగాధర్,లు , మండల ప్రధాన కార్యదర్శిలుగా. పిల్లి నరేష్, అరుగుల గణేష్, ఆసం మనోహర్, రాకేళి శంకర్, రాము పటేల్ డుకురే లను ఎన్నుకున్నారు. ఇతర కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. దేశ జనాభాలో 52 శాతం ఉన్న బీసీలు సామాజికంగా ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని, బీసీల సామాజిక ఆర్థిక అభివృద్ధి కోస 42 శాతం రిజర్వేషన్ కల్పించే అంతవరకు పోరాడుతామన్నారు. పార్టీలకు అతీతంగా అందరు పోరాటం చేసినప్పుడే 42 శాతం బీసీ రిజర్వేషన్ సాధ్యమవుతుందన్నారు. పార్టీ ఏ జెండాలు పక్కన పెట్టి బిసి రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తామన్నారు.

ఇది కూడా చదవండి :  "జాకు" అనే నేను... "శిరీష్" అనే నేను...!!
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page