📄 ePaper
Wednesday, April 22, 2026
📄 ePaper
HomeBusinessబంగారం కొనాలంటే భయమే.. జనవరి మొదటి వారంలోనే షాకిస్తున్న పసిడి ఇవే..

బంగారం కొనాలంటే భయమే.. జనవరి మొదటి వారంలోనే షాకిస్తున్న పసిడి ఇవే..

వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్: బంగారం ధరలు సామాన్యుడి చేతికి అందని స్థాయికి చేరుతున్నాయి. కొత్త సంవత్సరం ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే పసిడి రేట్లు రికార్డు స్థాయిలో పెరిగాయి. గతేడాది ధరల పెరుగుదలతో ఇప్పటికే ఇబ్బంది పడిన బంగారం ప్రియులు, ఈ ఏడాది అయినా ధరలు తగ్గుతాయన్న ఆశ పెట్టుకున్నారు. కానీ జనవరి మొదటి వారంలోనే ఆ ఆశలు అడియాసలు అయ్యాయి.

జనవరి 7, బుధవారం దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఒక్కరోజులోనే భారీగా పెరిగాయి. ముఖ్యంగా 24 క్యారెట్ల బంగారం ధర 100 గ్రాములకు రూ.6,600 పెరగడం గమనార్హం.
ఈ పెరుగుదలతో బంగారం కొనాలనుకునే వారు ఆలోచనలో పడుతున్నారు.

ఈ రోజు దేశవ్యాప్తంగా బంగారం ధరలు

క్యారెట్లు 1 గ్రాము (రూ.) 10 గ్రాములు (రూ.) 100 గ్రాములు (రూ.)
24 క్యారెట్లు 13,948 1,39,480 13,94,800
22 క్యారెట్లు 12,785 1,27,850 12,78,500
18 క్యారెట్లు 10,461 1,04,610 10,46,100

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లోనూ ఇదే స్థాయిలో బంగారం ధరలు కొనసాగుతున్నాయి.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1.39 లక్షల వద్ద ట్రేడ్ అవుతోంది.
22 క్యారెట్ల బంగారం ధర రూ.1.27 లక్షలు దాటింది.

ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం ధరలు

నగరం 24 క్యారెట్లు (రూ.) 22 క్యారెట్లు (రూ.) 18 క్యారెట్లు (రూ.)
హైదరాబాద్ 1,39,480 1,27,850 1,04,610
విజయవాడ 1,39,480 1,27,850 1,04,610
విశాఖపట్నం 1,39,480 1,27,850 1,04,610
చెన్నై 1,40,400 1,28,700 1,07,350
ముంబై 1,39,480 1,27,850 1,04,610
ఢిల్లీ 1,39,630 1,28,000 1,04,760
బెంగళూరు 1,39,480 1,27,850 1,04,610
ఇది కూడా చదవండి :  Gold & Silver Price Today: సంక్రాంతికి ముందు వెండి ధరలో భారీ ఊరట.. బంగారం రేట్లు ఎలా ఉన్నాయంటే?

అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు బలపడటం, డాలర్ కదలికలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు వంటి అంశాలు
పసిడి ధరల పెరుగుదలకు కారణాలుగా మారుతున్నాయి.
సమీప కాలంలో బంగారం ధరలు తగ్గే సూచనలు పెద్దగా కనిపించడం లేదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

Gold price today in India January 7 24 carat 22 carat rates
Gold prices surge sharply in India on January 7

పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో ఈ ధరల పెరుగుదల వినియోగదారులపై మరింత భారం వేయనుంది.
బంగారం కొనాలనుకునే వారు మార్కెట్ పరిస్థితులను గమనిస్తూ జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

Author: QAMAR SD

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page

https://man2bantul.id/https://portal.man2bantul.id/https://sirekap.man2bantul.id/https://eptsp.man2bantul.id/https://smkn5balam.com/https://tuluskartika.or.id/https://smptk.tuluskartika.or.id/https://www.stai-nurulhidayah.ac.id/https://journal.stai-nurulhidayah.ac.id/https://ejurnal.stai-nurulhidayah.ac.id/https://tical2025.redclara.net/https://uptdselatan.com/masterpoker99masterpoker99masterpoker99poker757poker757
masterpoker99masterpoker99masterpoker99masterpoker99inifun88inifun88inifun88https://jrdindustry.com/inifun88inifun88inifun88inifun88inifun88vovo88vovo88vovo88vovo88vovo88
inifun88inifun 88inifun88 logininipokerini pokerinipoker loginvovo88vovo88vovo88vovo88inifun88inifun88inifun88vovo88