📄 ePaper
Sunday, April 12, 2026
📄 ePaper
HomeCinema NewsBhimpur Suicide Case | ఉరి వేసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్య

Bhimpur Suicide Case | ఉరి వేసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్య

వాస్తవ నేస్తం,భీంపూర్: మద్యానికి బానిసై కుటుంబ భారాన్ని భరించలేక వ్యక్తి ఆత్మహత్య (suicide)చేసుకున్న ఘటన భీంపూర్ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్లి గ్రామానికి చెందిన కౌడల నాగన్న (42) సోమవారం (Adilabad District Bhimpur Mandal Aarly village) ఉదయం గ్రామ శివారులో జాలిపెల్లి మహేష్ వ్యవసాయ పొలం సమీపంలోని టేకు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం గమనించిన కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని వెంటనే భీంపూర్ పోలీసులకు సమాచారం అందించారు. ప్రాథమిక విచారణలో నాగన్న మద్యానికి బానిసై, కుటుంబ పోషణ కష్టంగా మారడం వల్ల మానసిక ఒత్తిడికి గురై మద్యం మత్తులోనే ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సంఘటనపై ఎలాంటి అనుమానాలు లేవని కుటుంబసభ్యులు పేర్కొన్నట్లు ఎస్ఐ విక్రమ్ తెలిపారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి :  Kurnool bus Accident : నిద్రలోనే సజీవ దహనం..!
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page