📄 ePaper
Wednesday, April 22, 2026
📄 ePaper
HomeBusinessఇంట్లో రాగి ఉన్నోడు రారాజే.. ఎందుకు ఒక్కసారిగా కాపర్‌పై కన్నేసిన ప్రపంచం?

ఇంట్లో రాగి ఉన్నోడు రారాజే.. ఎందుకు ఒక్కసారిగా కాపర్‌పై కన్నేసిన ప్రపంచం?

వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్: బంగారం, వెండి ధరలు భగ్గుమంటున్న వేళ ఇప్పుడు మరో లోహం ప్రపంచ మార్కెట్ దృష్టిని ఆకర్షిస్తోంది రాగి. రానున్న రోజుల్లో రాగి ధరలు మరింత ఎగబాకుతాయన్న అంచనాలు వినిపిస్తుండటంతో
ఇన్వెస్టర్లతో పాటు పరిశ్రమలన్నీ దీనిపైనే ఫోకస్ పెడుతున్నాయి.

ప్రపంచం ఇప్పుడు వేగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దిశగా అడుగులు వేస్తోంది. ఏఐ అంటే కేవలం సాఫ్ట్‌వేర్ కాదు. భారీ డేటా సెంటర్లు, సర్వర్లు, క్లౌడ్ నెట్‌వర్క్‌లు, విద్యుత్ వినియోగం ఇవన్నీ కలిసిన ఒక పెద్ద వ్యవస్థ. ఈ వ్యవస్థ పనిచేయాలంటే అపారమైన విద్యుత్ అవసరం. ఆ విద్యుత్ సరఫరాకు ఆధారం ఒక్కటే… రాగి.

డేటా సెంటర్లు పెరిగిన కొద్దీ సర్వర్ల సంఖ్య భారీగా పెరుగుతోంది.
సర్వర్లు ఎక్కువైతే వేడి ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఆ వేడిని నియంత్రించడానికి భారీ కూలింగ్ సిస్టమ్స్ అవసరం. ఇవి పనిచేయాలంటే మరింత విద్యుత్ కావాలి. ఈ మొత్తం విద్యుత్ ప్రసరణ వ్యవస్థలో కీలక పాత్ర పోషించేది రాగి వైర్లే. అందుకే నిపుణులు “ఏఐ అంటే విద్యుత్, విద్యుత్ అంటే రాగి” అని స్పష్టం చేస్తున్నారు.

అంతర్జాతీయంగా గోల్డ్‌మాన్ శాక్స్ వంటి ప్రముఖ ఆర్థిక సంస్థలు ఇప్పటికే రాగి డిమాండ్ భారీగా పెరుగుతుందని హెచ్చరిస్తున్నాయి. 2026 జనవరి నాటికి అంతర్జాతీయ మార్కెట్‌లో రాగి ధర పౌండ్‌కు 5.74 డాలర్లకు చేరుతుందన్న అంచనాలు ఉన్నాయి. భారత్‌లో ప్రస్తుతం స్పాట్ మార్కెట్‌లో కిలో రాగి ధర సుమారు రూ.1,156 స్థాయిలో కొనసాగుతోంది.
2025లోనే రాగి ధరలు టన్నుకు 12,000 డాలర్ల వరకు చేరడం మార్కెట్‌ను ఆశ్చర్యానికి గురి చేసింది.

ఇది కూడా చదవండి :  వామ్మో.. వెండి మళ్లీ విశ్వరూపం.. ఒక్కరోజులోనే షాక్ ఇచ్చిన ధరలు

ఈ పెరుగుదలకు ఏఐ మాత్రమే కారణం కాదు. ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ మరియు విండ్ ఎనర్జీ ప్రాజెక్టులు, గ్రిడ్ అప్‌గ్రేడ్స్, బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్స్ కూడా రాగి డిమాండ్‌ను వేగంగా పెంచుతున్నాయి. ప్రత్యేకంగా అమెరికా వంటి దేశాల్లో విద్యుత్ మౌలిక సదుపాయాలు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. అందుకే రాగిని ఇప్పుడు వ్యూహాత్మక లోహంగా పరిగణిస్తున్నారు.

నిపుణుల అంచనాల ప్రకారం 2026లో రాగి ధరలు ఒక్కసారిగా భారీగా పడిపోవు. కొంతకాలం 11,000 డాలర్ల పరిధిలో స్థిరంగా కదలాడే అవకాశం ఉంది. ఇది ధర పతనం కాదని, మార్కెట్ కొంత ఊపిరి పీల్చుకునే దశ మాత్రమేనని విశ్లేషకులు చెబుతున్నారు.

Copper price outlook driven by AI and electric vehicle demand
Copper demand rises as AI and energy transition reshape global markets

అసలు పెద్ద సమస్య సరఫరా వైపే ఉంది. కొత్త రాగి గనులు అభివృద్ధి కావాలంటే 7 నుంచి 12 సంవత్సరాలు పడుతుంది.
పర్యావరణ అనుమతులు, భూసేకరణ, పెట్టుబడుల అనుమతులు ఈ ప్రక్రియను మరింత నెమ్మదింపజేస్తున్నాయి.
మరోవైపు డిమాండ్ మాత్రం ఆగకుండా పెరుగుతోంది. ఈ అసమతుల్యతే రాగి ధరలకు ప్రధాన బలం అవుతోంది.

ఇలాంటి పరిస్థితుల్లో రాగి కేవలం ఒక లోహం కాదు.
భవిష్యత్తు టెక్నాలజీకి ప్రాణంగా మారుతోంది. అందుకే ఇప్పుడు ప్రపంచ మార్కెట్ మొత్తం రాగి వైపే చూస్తోంది.

Author: Qamar SD

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page

https://man2bantul.id/https://portal.man2bantul.id/https://sirekap.man2bantul.id/https://eptsp.man2bantul.id/https://smkn5balam.com/https://tuluskartika.or.id/https://smptk.tuluskartika.or.id/https://www.stai-nurulhidayah.ac.id/https://journal.stai-nurulhidayah.ac.id/https://ejurnal.stai-nurulhidayah.ac.id/https://tical2025.redclara.net/https://uptdselatan.com/masterpoker99masterpoker99masterpoker99poker757poker757
masterpoker99masterpoker99masterpoker99masterpoker99inifun88inifun88inifun88https://jrdindustry.com/inifun88inifun88inifun88inifun88inifun88vovo88vovo88vovo88vovo88vovo88
inifun88inifun 88inifun88 logininipokerini pokerinipoker loginvovo88vovo88vovo88vovo88inifun88inifun88inifun88vovo88