నకిలీ బాబా సహా ఏడుగురు సభ్యుల గ్యాంగ్ అరెస్ట్
వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: గుప్త నిధుల పేరుతో ప్రజలను నమ్మించి కోట్ల రూపాయలు వసూలు చేసిన నకిలీ బాబా గ్యాంగ్‌ను ఆదిలాబాద్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు దర్శనాల రాజ్‌కుమార్‌తో పాటు అతని గ్యాంగ్‌లోని మరో ఆరుగురు సభ్యులను అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీఅఖిల్ మహాజన్ ఐపీఎస్ తెలిపారు.ఇ ప్పటివరకు ఈ గ్యాంగ్‌పై ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో
మొత్తం 12 కేసులు నమోదు కాగా,
26 మంది బాధితుల నుంచి రూ.1,03,80,000/-
(ఒక కోటి మూడు లక్షల ఎనభై వేల రూపాయలు) వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలిందని తెలిపారు.
భీంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిప్పల్కోటి గ్రామానికి చెందిన దర్శనాల రాజ్‌కుమార్ గత మూడు సంవత్సరాలుగా తనకు దేవర వస్తుందని, మంత్రశక్తి ఉందని ప్రజలను నమ్మించాడు.
గుప్త నిధులు ఉన్నాయని, మంత్రశక్తి ద్వారా బంగారం తవ్విస్తానని చెప్పి తన బావ అర్ధంగి మహేందర్‌తో పాటు మిత్రులు నవీన్, అరుణ్, శ్యామ్, అఖిల్, కిరణ్‌లతో కలిసి
పథకం ప్రకారం మోసాలకు పాల్పడ్డాడు.
ముందుగానే తీసుకొచ్చిన కుండల్లో నకిలీ బంగారు నాణేలు పెట్టి తవ్వకాల్లో లభించినట్లుగా నాటకం ఆడి, 41 రోజులు పూజలు చేయాలని భయపెట్టి బాధితుల నుంచి డబ్బులు వసూలు చేసి పరారయ్యారు.
నమోదైన కేసులు
భీంపూర్ – 6, మావల – 1, నేరడిగొండ – 1, బోథ్ – 2,
ఆదిలాబాద్ రూరల్ – 1, జైనథ్ – 1
పోలీస్ స్టేషన్లలో మొత్తం 12 కేసులు నమోదు అయ్యాయి.
స్వాధీనం చేసుకున్న వస్తువులు
ఒక షిఫ్ట్ డిజైర్ కారు, ఒక ద్విచక్ర వాహనం, 7 మొబైల్ ఫోన్లు,
నకిలీ బంగారు నాణేలు, కుండలు, పూజా బట్టలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నిందితుల వివరాలు
| క్రమ సంఖ్య | పేరు | గ్రామం / మండలం | జిల్లా |
|---|---|---|---|
| A1 | దర్శనాల రాజ్‌కుమార్ @ దర్శనాల రాజు | పిప్పల్కోటి, భీంపూర్ | ఆదిలాబాద్ |
| A2 | అర్ధంగి మహేందర్ | ఘోట్కూరి, తాంసి | ఆదిలాబాద్ |
| A3 | బలేవర్ నవీన్ | పిప్పల్కోటి, భీంపూర్ | ఆదిలాబాద్ |
| A4 | రింగన్ కిరణ్ | పిప్పల్కోటి, భీంపూర్ | ఆదిలాబాద్ |
| A5 | ఏటి శ్యామ్ | పిప్పల్కోటి, భీంపూర్ | ఆదిలాబాద్ |
| A6 | కదిరి అఖిల్ | పిప్పల్కోటి, భీంపూర్ | ఆదిలాబాద్ |
| A7 | ధోనిపెల్లీ అరుణ్ కుమార్ | పిప్పల్కోటి, భీంపూర్ | ఆదిలాబాద్ |
మోసపోయిన బాధితుల వివరాలు
| క్రమ సంఖ్య | పేరు | గ్రామం / మండలం | మొత్తం (రూ.) |
|---|---|---|---|
| 1 | మద్దెల దయాకర్ | బుద్దికొండ, నేరడిగొండ | 6,00,000 |
| 2 | ముక్కేర తేజ | తాంసి (కే), భీంపూర్ | 4,00,000 |
| 3 | మస్కరి అనిల్ | పిప్పల్కోటి | 5,00,000 |
| 4 | కరే పవన్ కళ్యాణ్ | నిపాణి | 4,50,000 |
| 8 | సంగెపు వెంకటరమణ | బుద్దికొండ, నేరడిగొండ | 6,00,000 |
మొత్తం మోసపోయిన మొత్తం : రూ.1,03,80,000/-
