వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్: బంగారం అంటే భారతీయులకు ఉన్న అభిమానం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శుభకార్యాల నుంచి పెట్టుబడుల వరకు బంగారం కీలక పాత్ర పోషిస్తుంది. ఏడాది క్రితం వరకు లక్ష రూపాయల దిగువన ఉన్న బంగారం ధరలు, ఇటీవలి కాలంలో ఊహించని స్థాయిలో పెరిగాయి. రోజురోజుకూ పెరుగుతున్న ధరలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
అయితే ఇప్పుడు బంగారం కొనాలనుకునే వారికి కొంత ఊరటనిచ్చే వార్త వచ్చింది. వారం రోజుల పాటు పరుగులు పెట్టిన బంగారం ధరలు, గత రెండు రోజులుగా తగ్గుముఖం పట్టాయి. ఈ ధరల తగ్గుదల పేద, మధ్యతరగతి కుటుంబాలకు కొంత రిలీఫ్ ఇస్తోంది.
ఈ రోజు శుక్రవారం బంగారం ధరలను పరిశీలిస్తే, పది గ్రాముల 24, 22, 18 క్యారెట్ల బంగారంపై స్వల్పంగా రూ.10 తగ్గుదల నమోదైంది. ప్రస్తుతం పది గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,37,990 వద్ద ట్రేడ్ అవుతోంది. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,26,500గా కొనసాగుతోంది. అలాగే 18 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ.1,03,500 దగ్గర ఉంది.
వెండి ధరల విషయానికి వస్తే, పెట్టుబడులకు మంచి ఆప్షన్‌గా నిపుణులు సూచిస్తున్నప్పటికీ, గత రెండు రోజులుగా వెండి ధరలు కూడా తగ్గుతున్నాయి. నిన్న కేజీ వెండి ధర రూ.2,72,000గా ట్రేడ్ అయింది. 100 గ్రాముల వెండి ధర రూ.27,200గా నమోదైంది.
ఈ రోజు కేజీ వెండి ధరపై రూ.100, 100 గ్రాములపై రూ.10 తగ్గుదల నమోదైంది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.2,71,900గా ఉండగా, 100 గ్రాముల వెండి ధర రూ.27,190 వద్ద ట్రేడ్ అవుతోంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో ఈ రోజు 24 క్యారెట్ల బంగారం ధరలు (ఒక గ్రాముకు అంచనా) ఇలా ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీలో ఒక్క గ్రాము ధర రూ.13,977గా ఉంది. ముంబై, వడోదరలో రూ.13,995గా ట్రేడ్ అవుతోంది. కోల్‌కతాలో రూ.13,890గా ఉండగా, చెన్నై మరియు కేరళలో రూ.14,000గా నమోదైంది. బెంగళూరులో రూ.13,880గా ఉండగా, పూణే లో రూ.13,900గా కొనసాగుతోంది.
గమనిక: బంగారం, వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్లు, డాలర్ విలువ, దేశీయ డిమాండ్ ఆధారంగా తరచూ మారుతూ ఉంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు తాజా రేట్లు మరోసారి నిర్ధారించుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
Author: Qamar SD
