HomeBusinessGold and Silver Rates: వెండి, బంగారం.. తగ్గేదేలే.. ప్రస్తుతం ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold and Silver Rates: వెండి, బంగారం.. తగ్గేదేలే.. ప్రస్తుతం ధరలు ఎలా ఉన్నాయంటే?

📰 Generate e-Paper Clip

వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్: బంగారం, వెండి ధరలు మళ్లీ రికార్డ్ స్థాయిల దిశగా కదులుతున్నాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, అంతర్జాతీయ మార్కెట్లలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో పెట్టుబడిదారులు మరోసారి సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతున్నారు. దీనితో బంగారం, వెండికి డిమాండ్ కొనసాగుతూనే ఉంది.

డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ క్రమంగా క్షీణిస్తుండడం కూడా దేశీయంగా బంగారం, వెండి ధరలు పెరగడానికి మరో కారణంగా మారింది. అంతర్జాతీయ మార్కెట్ సంకేతాల ప్రభావం నేరుగా భారత మార్కెట్‌పై పడుతోంది.

ఈ నేపథ్యంలో మంగళవారం (జనవరి 6) మధ్యాహ్నం 12 గంటల సమయంలో హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర మరింత పెరిగింది. ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,38,820కి చేరింది. నిన్నటితో పోలిస్తే వెయ్యి రూపాయలకు పైగానే పెరిగింది.

అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా జోరు చూపించింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు ప్రస్తుతం రూ.1,27,250గా ఉంది. ఇది ఒక్కరోజులోనే దాదాపు రూ.1,200 మేర పెరగడం గమనార్హం.

దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరలు ఇదే దిశగా కదులుతున్నాయి. అక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,38,970కు చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,27,400 వద్ద కొనసాగుతోంది.

మరోవైపు వెండి కూడా తగ్గేదేలే అన్నట్టుగా పరుగులు పెడుతోంది. సోమవారంతో పోలిస్తే ఒక్కరోజులోనే కిలో వెండి ధర రూ.5,000 మేర పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2.71 లక్షలకు చేరుకుంది.

Gold and silver prices continue to rise as investors turn to safe-haven assets

దేశ రాజధాని ఢిల్లీలో వెండి ధర కూడా బలంగా ఉంది. అక్కడ ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2.53 లక్షల స్థాయిలో ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్ ట్రెండ్‌కు అనుగుణంగానే దేశీయంగా కూడా వెండి ధరలు కదులుతున్నట్లు తెలుస్తోంది.

– QAMAR SD

గమనిక: బంగారం, వెండి ధరలు మార్కెట్ పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కొనుగోలు లేదా పెట్టుబడులు పెట్టే ముందు తాజా రేట్లను మరోసారి నిర్ధారించుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్‌డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్‌లో వెంటనే చేరండి!

జాయిన్ వాస్తవ నేస్తం WhatsApp ఛానల్
RELATED ARTICLES
- Advertisment -

Most Popular