📄 ePaper
Thursday, March 26, 2026
📄 ePaper
HomeTelanganaAdilabadGovernment School : పాఠశాల నిధులు దుర్వినియోగం చేసిన ప్రధానోపాధ్యాయుడు  

Government School : పాఠశాల నిధులు దుర్వినియోగం చేసిన ప్రధానోపాధ్యాయుడు  

• అటెండర్ జీతభత్యాలను తన సొంత అవసరాలకు..

• తప్పుడు లెక్కలు, తప్పుడు రసీదులు సృష్టించిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు

వాస్తవ నేస్తం,ఇచ్చోడ: వేయిల జీతం ఉన్న ఆ ఉపాధ్యాయునికి సరిపోలేదు.. అత్యాశతో పాఠశాల కు వచ్చిన నిధులను సైతం ఆ ఉపాధ్యాయుడు దుర్వినియోగం చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని సిరికొండ మండలం పొన్న గ్రామంలో ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా నిధులు నిర్వహిన్న సూర్య ప్రకాష్ ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్నటువంటి సన్నబియ్యాన్ని పక్కదారి పట్టించారు. విద్యార్థులకు ఇస్తున్న నోట్ బుక్కులను తప్పుడు లెక్కలను రాసి, తప్పుడు రసీదులను చూపిస్తూ బిల్లులను తన సొంత అవసరాల కోసం వాడుకోవడం, అటెండర్ చౌహన్ మనోహర్ కు ప్రతి నెల రూ .8 వేలు జీతం, కాని ప్రభుత్వం నుండి ఎటువంటి డబ్బులు రావడం లేదని మాయమాటలు చెప్పి తనకు ఎంతో కొంత చేతికి ఇచ్చి మిగతా డబ్బును తనే వాడుకున్నాడని మనోహర్ తెలిపాడు. ఇట్టి విషయం తెలుసుకున్న గ్రామస్తులు, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు పాఠశాలకు సంబంధించినటువంటి అన్ని రికార్డులను తీసుకుని రమ్మనగా తీసుకురాకుండా తప్పుడు లెక్కలు చెప్పడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం తప్పు చేశానని ప్రధానోపాధ్యాయుడు ఒప్పుకొని రూ.63 వేల చెక్కును మనోహర్ కు ఇవ్వడం జరిగినదని గ్రామస్తులు తెలపడం జరిగినది. పాఠశాల నుండి ఈ ప్రధానోపాధ్యాయుని తొలగించి వేరే వారిని ఇక్కడికి రప్పించాలని, అలాగే పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచే విధంగా నాణ్యమైన విద్యను అందించే విధంగా ఉండే వారిని మాకు పంపగలరని ఎంఈఓ ని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు గ్రామస్తులు కోరారు.

ఇది కూడా చదవండి :  ACB Ride | ఏసీబీ వలలో మరో అవినీతి అధికారి
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page