• ప్రిన్సిపల్ చంపేస్తానని బెదిరిస్తున్నాడని విద్యార్థుల ఆరోపణలు
• అంబేద్కర్ చౌక్ లో పడుకొని నిరసన
వాస్తవ నేస్తం,ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో తీవ్ర ఉత్పత్తి నెలకొంది. తమను ప్రిన్సిపాల్ వేధిస్తున్నాడని.. చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడని ఆరోపిస్తూ విద్యార్థులు అంబేద్కర్ చౌరస్తాలో పడుకుని నిరసన తెలిపారు. మండల కేంద్రంలోని జ్యోతిబాఫూలే బాలుర రెసిడెన్షియల్ పాఠశాల (Mahatma Jyotiba Phule residential School) విద్యార్థులు ప్రిన్సిపాల్ వేదిస్తున్నాడంటు వసతి గృహం విడిచి రోడ్డుపై పరుగులు తీసి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో పడుకుని నిరసన తెలిపారు. నిరసన తెలిపిన విద్యార్థులను కౌన్సిలింగ్ ఇవ్వడం కోసం పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో మండల కేంద్రంలో ఉద్రిక్తత నెలకొంది.
