HomeTelanganaన్యాయవాద వృత్తి ఎంతో గౌరవప్రదమైనది: ఎంఎస్ఎస్ లా కళాశాల డైరెక్టర్ వందన సాంబ

న్యాయవాద వృత్తి ఎంతో గౌరవప్రదమైనది: ఎంఎస్ఎస్ లా కళాశాల డైరెక్టర్ వందన సాంబ

📰 Generate e-Paper Clip

• హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు, ఫ్యామిలీ కోర్టులను సందర్శించిన ఎంఎస్ఎస్ లా కళాశాల విద్యార్థులు

• న్యాయస్థానాల పనితీరు, వాదోపవాదాలపై ప్రత్యక్ష అవగాహన

• సవాళ్లతో కూడుకున్న వృత్తిలో రాణించాలి: ప్రిన్సిపల్ ఆదిల్ పిలుపు

 

హైదరాబాద్ (ఆగస్టు 27, వాస్తవ నేస్తం): న్యాయవాద వృత్తి సమాజంలో ఎంతో పవిత్రమైనదని, బాధితులకు న్యాయం అందించే అత్యున్నత బాధ్యత కలిగిన గౌరవప్రదమైన వృత్తి అని ఎన్ఎస్ఎస్ (MSS) లా కళాశాల డైరెక్టర్ వందన పేర్కొన్నారు. మంగళవారంఎంఎస్ఎస్  లా కళాశాల చివరి సంవత్సరం విద్యార్థులు హైదరాబాద్‌లోని ప్రసిద్ధ ‘సిటీ సివిల్ కోర్టు’తో పాటు ‘ఫ్యామిలీ కోర్టు’ను అధ్యయన పర్యటనలో భాగంగా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి డైరెక్టర్ వందన మాట్లాడుతూ… న్యాయశాస్త్రాన్ని కేవలం పుస్తకాలకే పరిమితం చేయకుండా, కోర్టులలో జరిగే ప్రత్యక్ష ప్రక్రియలను పరిశీలించడం ద్వారా విద్యార్థులకు నైపుణ్యం, వృత్తిపై స్పష్టత పెరుగుతాయని అభిప్రాయపడ్డారు.

లా చివరి సంవత్సరం అభ్యసిస్తున్న విద్యార్థులు ఈ పర్యటనలో ఉత్సాహంగా పాల్గొన్నారు. రోజువారీ కోర్టు కార్యకలాపాలు ఎలా సాగుతాయి, న్యాయమూర్తుల ముందు న్యాయవాదులు వాదనలు వినిపించే విధానం (Arguments), సాక్ష్యాల సమర్పణ, కేస్ డైరీల నిర్వహణ వంటి అంశాలను విద్యార్థులు అత్యంత ఆసక్తితో పరిశీలించారు. సివిల్ వివాదాలు, కుటుంబ సమస్యల పరిష్కారంలో ఫ్యామిలీ కోర్టులు వ్యవహరించే శైలిని, కౌన్సెలింగ్ పద్ధతులను పర్యవేక్షించారు.

​​MSS Law College students at Hyderabad Court
MSS Law College students during their court visit.

అనంతరం అక్కడ అందుబాటులో ఉన్న పలువురు సీనియర్ న్యాయవాదులతో విద్యార్థులు ముఖాముఖిగా మాట్లాడారు. కేస్ ప్రిపరేషన్, క్లయింట్లతో సంభాషణ, కోర్టు ప్రొసీడింగ్స్, సీనియర్ల వద్ద మెళకువలు నేర్చుకోవడం వంటి పలు సందేహాలను సీనియర్ న్యాయవాదులను అడిగి నివృత్తి చేసుకున్నారు. సీనియర్ న్యాయవాదులు సైతం తమ అనుభవాలను విద్యార్థులతో పంచుకుంటూ, న్యాయవాద వృత్తిలో పాటించాల్సిన విలువలను వివరించారు.

సవాళ్లతో కూడుకున్న వృత్తి: ప్రిన్సిపల్ ఆదిల్

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఆదిల్ మాట్లాడుతూ… “న్యాయవాద వృత్తి సవాళ్లతో కూడుకున్నది. రోజురోజుకూ చట్టాలలో వస్తున్న మార్పులు, సాంకేతికత వినియోగం పెరిగిన నేపథ్యంలో ప్రతిరోజూ నిరంతర విద్యార్థిలా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. నిరంతరం శ్రమించే తత్వం, న్యాయ సూత్రాలపై పట్టు ఉన్నప్పుడే ఈ రంగంలో ఉన్నత శిఖరాలను చేరుకోగలరు” అని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. భావి తరానికి ఆదర్శవంతమైన న్యాయవాదులుగా విద్యార్థులు తీర్చిదిద్దబడాలని ఆకాంక్షించారు.

అధ్యాపక బృందం దిశా నిర్దేశం

విద్యార్థుల ప్రాక్టికల్ లెర్నింగ్ ప్రోగ్రామ్‌లో భాగంగా నిర్వహించిన ఈ పర్యటన సజావుగా సాగేలా కళాశాల అధ్యాపకులు లత, సలావోద్దిన్ లు పర్యవేక్షించారు. కోర్టు ప్రాంగణంలోని వివిధ సెక్షన్లు, బెంచ్ ప్రొసీడింగ్స్, లీగల్ ఎయిడ్ క్లినిక్ ల ప్రాముఖ్యతను అధ్యాపకులు విద్యార్థులకు సమగ్రంగా ఎక్స్ప్లైన్ చేశారు. న్యాయస్థానాల్లో అనుసరించాల్సిన శైలి, కోర్టు నిబంధనలు (Court Etiquette) గురించి సమగ్రంగా వివరించారు.

MSS Law College students observing court proceedings
MSS Law College students gaining practical exposure to court proceedings.

పాఠ్యాంశాల్లో చదివిన చట్ట నిబంధనలను ప్రాక్టికల్ కోర్టు హాల్స్‌లో అప్లై చేసే ప్రక్రియను ప్రత్యక్షంగా చూడటం తమకు ఎంతో లబ్ధి చేకూర్చిందని లా ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. తమకు ఈ అద్భుతమైన అవకాశం కల్పించిన కళాశాల యాజమాన్యానికి, డైరెక్టర్ వందన గారికి, ప్రిన్సిపల్ ఆదిల్ గారికి మరియు అధ్యాపక బృందానికి విద్యార్థులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్‌డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్‌లో వెంటనే చేరండి!

జాయిన్ వాస్తవ నేస్తం WhatsApp ఛానల్
RELATED ARTICLES
- Advertisment -

Most Popular