వాస్తవ నేస్తం,నిజామాబాద్ : కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడైన పాత నేరస్తుడు షేక్ రియాజ్ సోమవారం పోలీసు కాల్పుల్లో మృతి చెందిన ఘటన జిల్లాలో సంచలనంగా ఘమారింది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రియాజ్, ఏఆర్ కానిస్టేబుల్ నుంచి తుపాకీ లాక్కొని ఫైర్ చేయడానికి ప్రయత్నించిన క్రమంలో పోలీసులు కాల్పులు జరిపారు. నగరంలోని హస్మికాలనీకి చెందిన రియాజ్‌కు వాహనాల దొంగతనాలు, చైన్‌స్నాచింగ్‌లు చేయడం అలవాటు గా మారింది. అతనిపై 40 పైగా కేసులు నమోదు అయ్యాయి. పాత కేసుల విచారణలో భాగంగా సీసీఎస్ పోలీసులు రియాజ్‌ను అదుపులోకి తీసుకున్న తరువాత ఊహించని ఘటనలు చోటు చేసుకున్నాయి. సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ను కత్తితో పొడిచి హత్యచేసి పారిపోయిన రియాజ్ కోసం ఎనిమిది ప్రత్యేక బృందాలు జల్లెడ పట్టాయి. సారంగపూర్ వద్ద అరెస్టు చేసి రియాజ్‌ను జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి ఆవరణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రియాజ్‌కు ఆస్పత్రి భవనం నాలుగో అంతస్తులోని 407 గదిలో చికిత్స అందించారు. అనంతర పరిణామ ఘటనల్లో రియాజ్ పోలీసు కాల్పుల్లో మృతి చెందాడు. పంచనామా, పోస్టుమార్టం సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. అనంతరం కుటుంబ సభ్యులకు మృత దేహాన్ని అందించగా మంగళవారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసులు అంత్యక్రియలు పూర్తయ్యే వరకు పకడ్బందీగా వ్యవహరించారు. రియాజ్ మృతి ఘటనకు సంబంధించి ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. కామారెడ్డి జిల్లా పోలీస్‌శాఖ నుంచి ఒక డీఎస్పీని విచారణ అధికారిగా నియమించారు.
Nizamabad : పోలీసుల కాల్పుల్లో రియాజ్ హతం.. బానసంచలు పేల్చి సంబరాలు
RELATED ARTICLES
