📄 ePaper
Wednesday, February 4, 2026
📄 ePaper
HomeBusinessసిల్వర్ ధర షాక్.. కిలో వెండిపై ఏకంగా రూ.11వేల పెరుగుదల.. గోల్డ్ కూడా దూకుడు!

సిల్వర్ ధర షాక్.. కిలో వెండిపై ఏకంగా రూ.11వేల పెరుగుదల.. గోల్డ్ కూడా దూకుడు!

వాస్తవ నేస్తం,బిజినెస్ డెస్క్: వెండి ధరలు మరోసారి కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్నాయి. గత కొన్ని రోజులుగా తగ్గినట్టే తగ్గి.. మరుసటి రోజే ఊహించని రీతిలో పెరిగిపోతున్నాయి. రెండు రోజుల పాటు స్వల్పంగా తగ్గిన వెండి ధరలు ఈరోజు మాత్రం అమాంతంగా పెరిగాయి. దీంతో మార్కెట్‌లో సిల్వర్‌పై ఆసక్తి ఒక్కసారిగా పెరిగింది.

ఈ ఏడాది బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిల్లో ట్రేడ్ అవుతున్నాయి. ముఖ్యంగా వింటర్ సీజన్ మొదలవడంతో వెండి ధరలు మరింత వేగంగా ఎగబాకుతున్నాయి. ఈరోజు ఒక్కరోజే కిలో వెండిపై రూ.11,000 పెరగడం గమనార్హం. దీంతో బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.2,60,000 స్థాయికి చేరుకుంది.

హైదరాబాద్‌, చెన్నై మార్కెట్లలో మాత్రం వెండి ధర మరింత ఎక్కువగా ట్రేడ్ అవుతోంది. ఈ నగరాల్లో కిలో వెండి ధర రూ.2,75,000 వరకు చేరింది. ఇక ఢిల్లీ, ముంబై, కోల్‌కతా వంటి ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర రూ.2,60,000 దగ్గర అమ్ముడవుతోంది. ఈ భారీ పెరుగుదలతో వెండి కొనాలనుకున్న వారు ఆలోచనలో పడుతున్నారు.

ఇక బంగారం ధరలు కూడా వెండికి తగ్గట్టు లేవు. ఈరోజు తులం బంగారం ధరపై రూ.1,150 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,40,460 వద్ద ట్రేడ్ అవుతోంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1,050 పెరిగి రూ.1,28,750 స్థాయికి చేరుకుంది.

Silver price today in India jumps sharply with gold rates rising in bullion market
Silver prices surge sharply in India as gold rates also climb

తక్కువ క్యారెట్ బంగారం ధరలు కూడా పెరుగుతున్నాయి. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.86 పెరిగి రూ.1,05,340 వద్ద ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్ ట్రెండ్స్, డాలర్ విలువ మార్పులు, డిమాండ్ పెరగడం వంటి కారణాలతో రాబోయే రోజుల్లో కూడా బంగారం, వెండి ధరలు ఇదే దూకుడు కొనసాగించే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

Author: QAMAR SD

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page