📄 ePaper
Friday, February 20, 2026
📄 ePaper
HomeTelanganaహోంగార్డ్ గుండెపై.. ఎస్పీ ఫోటో టాటు..

హోంగార్డ్ గుండెపై.. ఎస్పీ ఫోటో టాటు..

వాస్తవ నేస్తం,ఆదిలాబాద్ : ఓ నిజమైన అభిమానుడు తన గుండెపై ప్రత్యేక గుర్తు వేసుకున్నాడు. పోలీస్ శాఖలో పనిచేసే హోంగార్డ్ ఎస్పీ యొక్క ప్రతిరూపాన్ని టాటూగా వేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రానికి చెందిన హోంగార్డు బూస లక్ష్మణ్ తన అభిమాన పోలీస్ అధికారి ఫోటో తన ఛాతిపై టాటు చేసుకున్నాడు. ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తన పనితీరు, సమర్థత, ప్రజలతో నేరుగా మమేకమయ్యే సామర్థ్యంతో విస్తృతమైన గుర్తింపును పొందారు. యూత్ పాపులర్‌గా ఆయన ప్రవర్తన, ఆచరణ, కృషి అన్ని జీవితంలో ఉదాహరణగా మారాయి. హోంగార్డ్ బూస లక్ష్మణ్, ఎస్పీ మహాజన్ యొక్క ప్రతిరూపం టాటు కోసం ముంబాయ్‌లో ప్రసిద్ధి గాంచిన మహేష్ చౌహన్ వద్ద రెండు నెలల అపాయింట్‌మెంట్ తర్వాత ఖచ్చితమైన చిత్రాన్ని తన ఛాతిపై వేసుకున్నాడు. బూస లక్ష్మణ్ హోంగార్డు విధులు నిర్వహిస్తున్నప్పటికీ, ఎస్పీ మహాజన్ పై అద్భుతమైన అభిమానాన్ని ప్రతిబింబిస్తూ ఈ టాటు తన ప్రేమను, కృతజ్ఞతను వ్యక్తం చేస్తోంది.

ఇది కూడా చదవండి :  పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం : జిల్లా కలెక్టర్ రాజర్షి షా
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page