📄 ePaper
Wednesday, March 25, 2026
📄 ePaper
HomeTelanganaAdilabadనిందితుని పరారీ కేసులో ముగ్గురు పోలీసులపై వేటు

నిందితుని పరారీ కేసులో ముగ్గురు పోలీసులపై వేటు

• ఏఎస్సై , ఇద్దరు కానిస్టేబుల్ లు సస్పెండ్

వాస్తవ నేస్తం,ఆదిలాబాద్ : విధులు నిర్వహించడంలో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు పోలీసులపై జిల్లా ఉన్నతాధికారులు సస్పెండ్ వేటు వేశారు. వివరాల్లోకి వెళ్తే..అదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ నుండి ఓ నిందితుడు పరారీ అయిన ఘటనలో ముగ్గురు పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు జిల్లా ఉన్నతాధికారులు వారిని సస్పెండ్ చేసినట్లు ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే అదిలాబాద్ జిల్లా సోనాల మండలంలోని కోటా(కే) గ్రామానికి చెందిన ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారురాలి భర్త తనకు ఇంటి నిర్మాణానికి సంబంధించిన డబ్బులు ఇవ్వడంలేదని గుత్తేదారు సత్యనారాయణ అతడిని పట్టుకొని చెట్టుకు కట్టివేసిన ఘటన కలకలం రేపింది. ఇట్టి ఘటనను సీరియస్ గా తీసుకున్న ఉన్నతాధికారులు గుత్తేదారుపై కేసు నమోదు చేసి అరెస్టు చేయగా, నిందితుడు సత్యనారాయణ అదే రోజు రాత్రి బాత్ రూమ్ వెళ్తా అని చెప్పి నిందితుడు తప్పించుకొని పారిపోవడంతో విధుల్లో నిర్లక్ష్యం గా వ్యవహరించినందుకు జిల్లా ఉన్నతాధికారులు ఏఎస్సై , ఇద్దరు కానిస్టేబుల్ లను సస్పెండ్ చేశారు. జిల్లా ఎస్పీగా అఖిల్ మహాజన్ బాధ్యతలు చేపట్టిన నుండి తప్పు చేసిన వారు ఎంతటి వారైనా చర్యలు తీసుకుంటున్నారని జిల్లా వ్యాప్తంగా ప్రజలు ప్రశంసిస్తున్నారు.

ఇది కూడా చదవండి :  folic acid | ఐరన్ మాత్రలు వికటించి విద్యార్థుల అవస్థత 
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page