e-paper
Thursday, January 8, 2026
HomeCrime NewsVillage Development Comities | విడీసీల ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధం

Village Development Comities | విడీసీల ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధం

• విడిసిల అక్రమాల పై కఠిన చర్యలు తప్పవు

• విడిసిల అక్రమ వసూళ్లకు దందాలకు సెటిల్మెంట్లకు అవకాశాలు లేవు

• వీడీసీల వల్ల ఎలాంటి సమస్యలు ఉన్న సంప్రదించాలి

• ఎస్పీ అఖిల్ మహాజన్

వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: విడీసీల ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమని ఎస్పీ అఖిల్ మహాజన్ ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామ అభివృద్ధి కమిటీలు (Village Development clVommittees)ప్రజలకు భారంగా, ప్రజల వద్ద న్యాయస్థానాన్ని ప్రభుత్వ యంత్రాంగాన్ని సంప్రదించకుండా గ్రామ అభివృద్ధి పేరుతో వసూలు చేయడం చట్ట వ్యతిరేకమని ఎస్పీ తెలిపారు.

గ్రామ అభివృద్ధి పేరుట అక్రమ వసూళ్లకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారంగా కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. గత సంవత్సరం పలు కేసులను నమోదు చేయడం జరిగిందని తెలిపారు. గ్రామాలలో బెల్ట్ షాపులను, కళ్ళు దుకాలను, ఇసుక తవ్వకాలకు అనధికారికంగా అనుమతులు ఇవ్వడం వీడీసీ లకు (VDC)అర్హతలు లేవని స్పష్టం చేశారు. వారి అనుమతితో చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిర్వహించే వారిపై మరియు విడీసీ లపై కేసులు నమోదు చేయబడతాయని హెచ్చరించారు. ఎవరైనా గ్రామ అభివృద్ధి వలన ఇబ్బందులు ఎదుర్కొంటే పోలీస్ స్టేషన్లను సంప్రదించాలని అన్నారు. భవిష్యత్తులో అసాంఘిక కార్యకలాపాలకు ఎలాంటి బహిష్కరణలకు వసూళ్లకు, దందాలకు వీడీసీలు పాల్పడితే చట్టపర చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page