📄 ePaper
Monday, March 16, 2026
📄 ePaper
HomeTelanganaAdilabadప్రాధన్ సమాజం మనోభావాలను దెబ్బతీసిన వ్యక్తిపై ఫిర్యాదు 

ప్రాధన్ సమాజం మనోభావాలను దెబ్బతీసిన వ్యక్తిపై ఫిర్యాదు 

వాస్తవ నేస్తం,ఇచ్చోడ: సోషల్ మీడియాలో ప్రధాన్ సమాజం మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడిన వెడ్మ వెంకటేష్ పై చర్యలు తీసుకోవాలని. మండల ప్రధాన సమాజం కమిటీ సభ్యులు బుధవారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం సంఘం సభ్యులు మాట్లాడుతూ.. ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం, గుండాల గ్రామానికి చెందిన వెడ్మ వెంకటేష్ సోషల్ మీడియాలో ప్రాధన్ సమాజం మనోభావాలను కించపరిచేలా మాట్లాడారు అని, అట్టి వ్యక్తిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యంలో ప్రధాన్ సమాజ్ సంఘం మండల అధ్యక్షుడు గేడం మధుకర్, ఉపాధ్యక్షులు పెందుర్ ప్రభాకర్, గౌరవ అధ్యక్షులు ఉయకే బలిరం , మహిళా రాష్ట్ర సభ్యురాలు ఉయకే సుగ్మాత, తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి :  Cattle Smuggling Racket | అంతర్ రాష్ట్ర పశువుల అక్రమ రవాణా రాకెట్ భగ్నం చేసిన పోలీసులు
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page