దేశీయంగా బంగారం ధరలు మరోసారి తగ్గాయి. ఇటీవల కొద్ది రోజులుగా ఊగిసలాటలో ఉన్న పసిడి రేట్లు ఈరోజు తగ్గుముఖం పట్టాయి. అయితే అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం బంగారం ధరలు పెరిగాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాలు పెరగడంతో అక్కడ గోల్డ్ రేట్లు ఎగబాకినట్టు విశ్లేషకులు చెబుతున్నారు.
అంతర్జాతీయ పరిస్థితులు | International Market Updates
- ఇంటర్నేషనల్ మార్కెట్లో ఒక్కరోజులో గోల్డ్, సిల్వర్ రేట్లు భారీగా పెరిగాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ ఔన్సుకు 4,136 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. గత సెషన్ తో పోలిస్తే దాదాపు 50 డాలర్ల మేర పెరిగింది. వెండి ధర కూడా 51.42 డాలర్లకు చేరింది.
అదే సమయంలో రూపాయి విలువ బలహీనపడింది. ప్రస్తుతం డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 89.17 వద్ద ఉంది.
హైదరాబాద్ గోల్డ్ రేట్లు | Hyderabad Gold Prices
హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర ఈరోజు తులానికి 650 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం తులం ధర 1,14,690 రూపాయలుగా ఉంది. అంతకుముందు రోజు భారీ పెరుగుదల తర్వాత మళ్లీ ధర తగ్గడం వినియోగదారులకు కొంత ఉపశమనంగా మారింది. 24 క్యారెట్ల పసిడి రేటు కూడా పడిపోయింది. ప్రస్తుతం 10 గ్రాముల ధర 1,25,130 రూపాయలుగా ఉంది. ఈరోజు 710 రూపాయల మేర తగ్గింది.
వెండి ధరలు కూడా తగ్గుముఖంలో | Silver Price in Hyderabad
హైదరాబాద్‌లో వెండి ధర కూడా ఈరోజు తగ్గింది. కిలో వెండి 1,000 రూపాయలు తగ్గడంతో ప్రస్తుత ధర 1.71 లక్షలుగా ఉంది. ఇటీవలే కిలో సిల్వర్ 2.07 లక్షలకు చేరి ఆల్ టైమ్ గరిష్టాన్ని నమోదు చేసింది. ప్రస్తుతం ఆ స్థాయితో పోలిస్తే గణనీయంగా తక్కువ ధరల్లో ఉంది.
బంగారం, వెండి ధరలు ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి. స్థానిక పన్నులు, లేబర్ చార్జీలు మరియు ఇతర కారణాల వల్ల ప్రతి ప్రాంతంలో రేట్లు భిన్నంగా ఉంటాయి. ఆభరణాలు కొనుగోలు చేసే సమయంలో తుది బిల్లుపై 3% జీఎస్టీ అమల్లో ఉంటుంది.
🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్లో వెంటనే చేరండి!
జాయిన్ వాస్తవ నేస్తం WhatsApp ఛానల్